అనుష్క అలా ఎందుకు చేసింది (వీడియో)

అనుష్క అలా ఎందుకు చేసింది (వీడియో)

ఐపీఎల్.11లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది.అచ్చొచ్చిన సొంత మైదానం చిన్నస్వామిలో ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. కోల్‌కతా ఇన్నింగ్స్ ఆఖర్లో ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్ మాత్రం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. మహ్మద్ సిరాజ్ వేసిన 19వ ఓవర్ ఐదో బంతిని దినేశ్ కార్తీక్ లాంగ్ ఆన్‌లో భారీ షాట్ ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ మెరుపు వేగంతో డైవ్ చేసి బంతిని అందుకున్నాడు.  గ్యాలరీలో ఉన్న తన సతీమణి అనుష్క శర్మ సైతం ఎలాంటి సంబరాలు చేసుకోకుండా మౌనంగా ఉండిపోయింది. తనతో పాటు మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన వారు సందడి చేస్తూన్నా కూడా మౌనంగా మ్యాచ్‌ను చూసింది. కీలక సమయంలో క్రీజులో ఉన్న దినేశ్ కార్తీక్ కేవలం 10 బంతుల్లోనే 2ఫోర్లు, సిక్స్ సాయంతో 23 పరుగులు సాధించి కోల్‌కతాను విజయతీరాలకు చేర్చాడు. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos