క్రికెటర్ జడేజా భార్యపై పోలీసు కానిస్టేబుల్ దాడి

Ravindra Jadeja’s wife attacked by policeman in Jamnagar
Highlights

ఐపిఎల్ చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్  రవీంద్ర జడేజా భార్యపై ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ దాడి చేశాడు.

న్యూఢిల్లీ: ఐపిఎల్ చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్  రవీంద్ర జడేజా భార్యపై ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ దాడి చేశాడు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగింది. షాపింగ్‌కు బయల్దేరిన జడేజా భార్య రీవా సోలంకి నడుపుతున్న బీఎండబ్ల్యూ కారు కానిస్టేబుల్ సంజయ్ అహిర్ పల్సర్ మోటార్ సైకిల్ ను ఢీకొట్టింది.

నిజానికి, కానిస్టేబుల్‌ సంజయ్‌ అహిర్‌ పల్సర్‌ మోటార్‌సైకిల్‌ రాంగ్ రూట్ లో వస్తుండగా ఈ సంఘటన జరిగింది. దెబ్బలేమైనా తగిలాయా అని ఆ కానిస్టేబుల్‌ను రీవా సోలంకి అడిగే లోగానే అతడు  తీవ్ర ఆగ్రహంతో దాడికి దిగాడు. దీంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి.
 
ఓ దశలో అతను ఆమె జుట్టు పట్టుకుని కొట్టబోయాడు. ఆ సమయంలో అక్కడున్నవారు ఆమెను రక్షించారు. ఆ తర్వాత చికిత్సకోసం రీవా ఆస్పత్రికి వెళ్లింది. ఆస్పత్రిలో జామ్‌నగర్‌ ఎస్పీ ప్రదీప్‌ కలుసుకుని స్వయంగా ఆమెను స్టేషన్‌కు తీసుకొచ్చి వాంగ్మూలం తీసుకున్నారు. 

రీవాపై దాడి చేసిన కానిస్టేబుల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మహిళపై దాడి చేయడం తీవ్రమైన నేరమని, దీనిపై విచారణ జరిపి సంజయ్‌ అహిర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని జామ్‌నగర్‌ ఎస్పీ ప్రదీప్‌ తెలిపారు. కాగా, 2017లో కూడా రీవా ఓ యాక్సిడెంట్‌ వివాదంలో చిక్కుకుంది.

loader