ఫింగర్ స్పిన్నర్ ని, వేళ్లతోనే..: రషీద్ ఖాన్

Rashid Khan reveals his bowling technique
Highlights

అఫ్గినిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు.

డెహ్రాడూన్‌: అఫ్గినిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ వార్తల్లో వ్యక్తిగా మారిపోయాడు. ఆయనను అందరూ అద్భుతమైన మణికట్టు స్పిన్నర్ అని పిలుస్తున్నారు. అయితే, తాను ఫింగర్ స్పిన్నర్ ని అని చెప్పుకుంటున్నాడు. 

తాను మణికట్టు కన్నా ఎక్కువగా చేతివేళ్లను బంతిని తిప్పడానికి వాడుతానని చెబుతున్నారు.  వేలి కొనలతో బంతిని తిప్పడం వల్ల వేగంగా విసరడానికి అవకాశం లభిస్తుందని అంటున్నాడు.

లెగ్ స్పిన్ ఎలా వేయాలో తనకు ఎవరూ చెప్పలేదని, ఆ అవకాశం కూడా తనకు లేదని అన్నాడు. అయితే ఐదారేళ్ల క్రితం షాహిద్ అఫ్రిది, అనిల్ కుంబ్లేల వీడియోలను చూసేవాణ్ని అని చెప్పాడు. ఇప్పటికీ ఖాళీ సమయాల్లో కుంబ్లే బౌలింగ్ వీడియోలను చూస్తుంటానని అన్నాడు. 

లెగ్‌ స్సిన్‌లో ఎప్పటికప‍్పుడు కొత్త విషయాల‍ను తెలుసుకుంటూ ముందుకు సాగుతానని, ఎక్కువగా మణికట్టును ఉపయోగించబోనని, వేళ్లతోనే బంతిని తిప్పడానికి ప్రయత్నిస్తానని అన్నాడు.  లెగ్‌స్పిన్నర్‌ ఇలా బౌలింగ్‌ వేయడం వల్ల అదనపు ప్రయోజనం ఉంటుందని అతను అన్నాడు.

loader