రషీద్‌ ఖాన్‌...ఈ పేరు ఇపుడు ఐపిఎల్ క్రికెట్ లో సంచలనం. ముఖ్యంగా తెలుగు క్రికెట్ అభిమానులను ఫిదా చేస్తున్న చేస్తోంది. తన బౌలింగ్ ప్రతిభతో సన్ రైజర్స్ హైదరాబాద్ కు చాలా మ్యాచ్ లు గెలింపించినప్పటికి రషీద్ ఖాన్ పేరు అంత సంచలనం కాలేదు. కానీ నిన్న రాత్రి కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన రెండో క్వాలిఫైయర్‌ మ్యాచ్‌లో అతడు చూపించిన ఆల్ రౌండ్ ప్రతిభకు ప్రతిఒక్కరు ముగ్దులైపోయారు. ఓటమి వైపు పయనిస్తున్న టీమ్ ను మళ్లీ విజయతీరాల వైపు నడిపించిన ఈ అప్ఘాన్ ప్లేయర్ కి ఇండియన్ క్రికెట్ లవర్స్ బ్రహ్మరథం పడుతున్నారు.

ఇక ఆటలోనే కాదు...సామాజిక సేవలో కూడా తాను 100 శాతం ముందుంటానని రషీద్ ఖాన్ నిరూపించాడు. తన అద్భుత ఆటతీరువల్ల నిన్నటి మ్యాచ్ లో లభించిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అమౌంట్ 5 లక్షలను గతవారం అప్ఘనిస్తాన్ లో జరిగిన బాంబు పేలుళ్ల బాధితులకు అందించనున్నట్లు ప్రకటించారు. అలాగే ఈ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా వారికే అంకితమివ్వనున్నట్లు తెలిపాడు. ఇదివరకే ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో గెలుచుకున్న మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ని కూడా ఇదే పేలుళ్లలో గాయపడిన తన స్నేహితుడు, అతడి కొడుకుకి అంకితమిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

హైదరాబాద్ టీమ్‌ను ఐపీఎల్ ఫైనల్‌కు చేర్చడంతో ముఖ్య పాత్ర పోషించిన ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ రషీద్ ఖాన్‌ను.. ఆ దేశాధ్యక్షుడు అభినందించారు. రషీద్ ఓ హీర్ అని, అతని ఆట తీరు పట్ల గర్వంగా ఫీలవుతున్నట్లు ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తన ట్వీట్‌లో తెలిపారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తమ దేశ ఆటగాళ్లకు నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం ఇచ్చిన భారతీయ స్నేహితులకు ఘనీ కృతజ్ఞతలు తెలిపారు.