సారాంశం

IOA appoints Raghuram Iyer as its CEO: భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) తన సీఈవోగా రఘురామ్ అయ్యర్ ను నియమించింది. అయ్యర్ గతంలో ఐపీఎల్ జట్లైన రాజస్థాన్ రాయల్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ కు సీఈఓగా పనిచేశాడు.
 

IOA appoints Raghuram Iyer as its CEO: భారత ఒలింపిక్ సంఘం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా రఘురామ్ అయ్యర్ ను నియమిస్తున్నట్లు భారత ఒలింపిక్ అసోసియేషన్ వెల్లడించింది. ఏడాది కాలంగా ఈ పోస్టు నియామ‌కం కోసం సంప్ర‌దింపులు జ‌రుగుతున్నాయి. భార‌త ఒలింపిక్ అసోసియేషన్ ఒక ప్ర‌క‌ట‌న‌లో సీఈవో నియామ‌కం గురించి వెల్ల‌డిస్తూ.. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) శుక్రవారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్టు రాజస్థాన్ రాయల్స్ మాజీ అధికారి రఘురామ్ అయ్యర్‌ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) గా నియమించిన‌ట్టు తెలిపింది. ప‌దేప‌దే అంత‌ర్జాతీయ ఒలింపిక్ సంఘం సీఈవో నియామ‌కం గురించి రిమైండర్‌లను గుర్తుచేసిన ఒక సంవ‌త్స‌రం త‌ర్వాత ఈ నియామ‌కం జ‌రిగింది.

భార‌త ఒలింపిక్ అసోసియేషన్ శుక్ర‌వారం విడుద‌ల చేసిన ఒక ప్ర‌క‌ట‌న‌లో "నామినేషన్ కమిటీ నిర్వహించిన ఖచ్చితమైన ఎంపిక ప్రక్రియ తర్వాత రాఘురామ్ అయ్యర్‌ను సీఈవోగా నియమించినట్లు" తెలిపింది. 2022 డిసెంబర్ 10న పీటీ ఉష నేతృత్వంలోని కొత్త‌ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ బాధ్యతలు స్వీకరించిన నెల రోజుల్లోనే సీఈఓను నియమించాలని భారత సంస్థ ఐఓఏ భావించింది. అయితే అభ్యర్థిని ఎంపిక చేయడంలో ఐఓఏ విఫలమైంది. అక్టోబర్ లో ముంబైలో జరిగిన ఐఓసీ సమావేశాల్లో ఐఓఏ సీఈఓ కొరతను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ కూడా లేవనెత్తింది.

తాజాగా ఈ నియామ‌కం విష‌యంలో నిర్ణ‌యం తీసుకుంది. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవికి రఘురామ్ అయ్యర్ ను నామినేషన్ కమిటీ ఏకగ్రీవంగా ఎంపిక చేసిందని ఐఓఏ ఒక ప్రకటనలో తెలిపింది. "రాఘురామ్ అయ్య‌ర్  అనుభవం, స్పోర్ట్స్ మేనేజ్మెంట్, పరిపాలనలో నిరూపితమైన ట్రాక్ రికార్డ్ భారతదేశంలో ఒలింపిక్ క్రీడలను ప్రోత్సహించడం-అభివృద్ధి చేయడంలో ఐఓఏకు నాయకత్వం వహించడానికి అతన్ని ఆదర్శవంతమైన అభ్యర్థిగా చేస్తుందని" పేర్కొంది. కాగా, అయ్య‌ర్ ఇదివ‌ర‌కు ఐపీఎల్ జట్లైన రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ కు సీఈఓగా పనిచేసిన అనుభవం ఉంది.

Virat Kohli: ఇద్ద‌రు పాక్ దిగ్గ‌జాల రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టిన విరాట్ కోహ్లీ