నాకు ఫైనల్ ఫోబియా లేదు.. ఎవరైనా గెలవడానికే ఆడతారు: పీవీ సింధు

First Published 7, Aug 2018, 12:20 PM IST
PV sindu comments against final phobia
Highlights

వరుసగా మెగా టోర్నీల్లో ఫైనల్ పోరులో ఓడిపోతుండటంతో పీవీ సింధుపై విమర్శకులు సెటైర్లు పేలుస్తున్నారు. సింధుని ఫైనల్ ఫోబియా వెంటాడుతోందని.. ఒత్తిడికి చిత్తయిపోతుందంటూ సోషల్ మీడియాలో విపరీతంగా కథనాలు రావడంతో తెలుగు తేజం స్పందించింది

వరుసగా మెగా టోర్నీల్లో ఫైనల్ పోరులో ఓడిపోతుండటంతో పీవీ సింధుపై విమర్శకులు సెటైర్లు పేలుస్తున్నారు. సింధుని ఫైనల్ ఫోబియా వెంటాడుతోందని.. ఒత్తిడికి చిత్తయిపోతుందంటూ సోషల్ మీడియాలో విపరీతంగా కథనాలు రావడంతో తెలుగు తేజం స్పందించింది. తనకు ఫైనల్ ఫోబియా లేదని.. చాలా మంది ఫైనల్‌కు రాకుండానే వెనుదిరుగుతున్నారని.. తాను ఫైనల్లో ఓడిపోయానని బాధపడే బదులు.. తన ఖాతాలో మరో పతకం వచ్చిందని సంతోషపడతానని సింధు తెలిపారు.

పసిడి పతకాన్ని సాధించాలని ఎవరికి ఉండదు చెప్పండి... స్వర్ణాన్ని సాధించేందుకు శతవిధాలా కృషి చేశానని.. తొలి రౌండ్‌లో మారిన్‌కు గట్టిపోటీ ఇవ్వగలిగానని సింధు అన్నారు.. ప్రపంచ ఛాంపియన్‌షిప్ అనేది పెద్ద టోర్నీ అని... అక్కడ అంతా గట్టి ప్రత్యర్థులే ఉంటారని ... అందరూ పతకం సాధించాలన్న లక్ష్యంతోనే అక్కడ అడుగుపెడతారని.. తాను కూడా అలాగే వెళ్లినట్లు సింధు చెప్పారు. ఏకాగ్రతతో ఆడినందువల్లే రజత పతకాన్ని సొంతం చేసుకోగలిగానని తేల్చి చెప్పారు.
 

loader