మలేషియా ఓపెన్ నుండి సింధు ఔట్

pv sindhu lose in Malaysia Open semifinals
Highlights

సెమి ఫైనల్లో తైపీ క్రీడాకారిణి చేతిలో పరాజయం..

మలేషియా ఒపెన్ టెన్నిస్ లో మరో తెలుగు క్రీడాకారిణి వెనుదిరిగింది. ఇదివరకే సైనా నేహ్వాల్ ఈ టోర్నీ నుండి నిష్క్రమించగా తాజాగా సింధు కూడా అదే బాటలో నడిచింది. ఇవాళ జరిగిన సెమీ ఫైనల్లో తైపి క్రీడాకారిణి తాయ్ జూ చేతిలో సింధు ఓటమిపాలై ఇంటి ముఖం పట్టింది.

ఈ మ్యాచ్ లో సింధు చాలా ఇబ్బంది పడింది. ఏ దశలోనే ప్రత్యర్థికి గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. సింధు పై తాయ్ జూ 21-15, 19-21, 21-11 తేడాతో విజయం సాధించింది. 

ఆట మొదలైనప్పటి నుండి తైపి షట్లర్ దూకుడుగా ఆడింది. దీంతో మైదటి గేమ్ ను సునాయాసంగా గెలుచుకోగల్గింది. ఇక సెకండ్ గేమ్  లో సింధు విజృంభించినప్పటికి తాయ్ కూడా అదే రీతిలో ఆడింది. ఇలా హోరాహోరీగా జరిగిన రెండో గేమ్ ను కాస్త కష్టంగానే  సింధు గెల్చుకుంది.

దీంతో మూడో గేమ్ నిర్ణయాత్మకంగా మారింది. కానీ ఇందులో మళ్లీ సింధు తడబడింది. సింధు పొరపాట్లను ఆసరాగా చేసుకుని తాయ్ దూసుకుపోయింది. ఈ గేమ్ లో సింధు పదే పదే తనకొచ్చిన అవకాశాలను  చేజార్చకుంది. దీంతో ఈ గేమ్ లో పూర్తి ఆధిపత్యాన్ని కనబర్చిన తైపి షట్లర్ సింధును అతి సునాయాసంగా ఓడించింది.

ఈ ఓటమితో సింధు మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో జరుగుతున్న మలేషియా ఓపెన్ టెన్నిస్ సెమిఫైనల్ నుండి వెనుదిరగాల్సి వచ్చింది. ఈ గెలుపుతో తాయ్ జూ ఫైనల్ కు చేరింది. 

loader