ఫోర్బ్స్ జాబితా టాప్ టెన్ లో పీవీ సింధు

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 22, Aug 2018, 2:30 PM IST
PV Sindhu in top 10 in Forbes list
Highlights

భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు ఫోర్బ్స్‌ జాబితాలో చోటు దక్కించుకుంది. ప్రపంచంలో అత్యధిక మొత్తంలో సంపాదిస్తోన్నమహిళా క్రీడాకారులు జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. ఆ జాబితాలో పీవీ సింధు ఏడో స్థానంలో దక్కించుకుంది. 

ఢిల్లీ: భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు ఫోర్బ్స్‌ జాబితాలో చోటు దక్కించుకుంది. ప్రపంచంలో అత్యధిక మొత్తంలో సంపాదిస్తోన్నమహిళా క్రీడాకారులు జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. ఆ జాబితాలో పీవీ సింధు ఏడో స్థానంలో దక్కించుకుంది. 

భారత్‌ నుంచి టాప్‌-10లో నిలిచిన ఏకైక క్రీడాకారిణి సింధు కావడం విశేషం. టెన్నిస్‌ క్రీడాకారిణులు కాకుండా కేవలం ఇద్దరు మాత్రమే ఈ జాబితాలో టాప్‌-10లో నిలవగా... అందులో సింధు ఉండటం మరో విశేషం.

అమెరికా అగ్రశ్రేణి టెన్నిస్‌ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. సెరెనా ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలవడం ఇది మూడోసారి. గత ఏడాది బిడ్డకు జన్మనివ్వడం వల్ల కొంతకాలం టెన్నిస్‌కు దూరమైన సెరెనా ఈ ఏడాది మార్చిలో తిరిగి ఆడటం మొదలుపెట్టింది. 

దీంతో అగ్రస్థానంలో నిలిచింది. టోర్నీలు ఆడటం ద్వారా... ప్రైజ్‌మనీతో పాటు.... వాణిజ్య ఒప్పందాల ద్వారా వీరు అందుకుంటున్నమొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని ఫోర్బ్స్‌ ఈ జాబితాను తయారు చేసింది.

టాప్‌-10లో చోటు దక్కించుకున్న క్రీడాకారిణులు.. వారి సంపాదన(అమెరికా డాలర్లలో):

1. సెరెనా విలియమ్స్‌ - టెన్నిస్‌ - 18.1 మిలియన్లు

2. కరోలిన్‌ వొజ్నొకి- టెన్నిస్‌ - 13 మిలియన్లు

3. స్లోనే స్టీఫెన్స్‌ - టెన్నిస్‌ - 11.2 మిలియన్లు

4. గార్బిన్‌ ముగురుజ - టెన్నిస్‌ - 11 మిలియన్లు

5. మరియా షరపోవా - టెన్నిస్‌ - 10.5 మిలియన్లు

6. వీనస్‌ విలియర్స్‌ - టెన్నిస్‌ - 10.2 మిలియన్లు

7. పీవీ సింధు - బ్యాడ్మింటన్‌ - 8.5 మిలియన్లు

8. సిమోనా హలెప్‌ - టెన్నిస్‌ - 7.7 మిలియన్లు

9. డానిక పాట్రిక్‌ - రేస్‌ కార్‌ డ్రైవర్‌ - 7.5 మిలియన్లు

10. కెర్బర్‌ - టెన్నిస్‌ - 7 మిలియన్లు

loader