పుల్లెల గోపీచంద్ షాకింగ్ నిర్ణయం... ఆ ఇద్దరితో మనస్పర్థల కారణంగానే...
టోక్యోలో జరిగే ఒలింపిక్స్‌కి వెళ్లడం లేదని ప్రకటించిన పుల్లెల గోపీచంద్...
జాతీయ కోచ్ లేకుండానే ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లు... సైనా, సింధులతో మనస్పర్థలే కారణమంటూ వార్తలు...
దేశంలో బ్యాడ్మింటన్ వెలుగులకు ప్రధాన కారణం పుల్లెల గోపీచంద్. ‘ద్రోణాచార్య’ అవార్డు గెలిచిన పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్‌తో పాటు పీవీ సింధు, కిడాంబ శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్ వంటి ఎందరో బ్యాడ్మింటన్ స్టార్లను తయారుచేశారు.
అయితే ఆయన టోక్యోలో జరిగే ఒలింపిక్స్‌కి వెళ్లడం లేదని ప్రకటించి, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు... 2012 లండన్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ సైనా నెహ్వాల్ కాంస్య పతకం గెలవడానికి, 2016 రియో ఒలింపిక్స్‌లో సింధు రజత పతకంతో మెరవడానికి ప్రధాన కారణమైన గోపీచంద్ లేకుండానే, టోక్యో ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ జట్టు అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
గోపిచంద్ నిర్ణయానికి సింధు, సైనా నెహ్వాల్ వంటి స్టార్లతో ఏర్పడిన మనస్పర్థలే కారణమని టాక్ వినబడుతోంది. అయితే ప్రస్తుతం గోపీచంద్ తన బ్యాడ్మింటన్ అకాడమీ పనుల్లో బిజీగా ఉండడంతో సైనా, సింధుతో పాటు ప్రతీ బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా ఓ వ్యక్తిగత కోచ్‌ను నియమించుకున్నారు.
వీరంతా ప్లేయర్లతో పాటు టోక్యో ఒలింపిక్స్‌కి వెళ్లబోతున్నారు. దీంతో వారికి అనువుగా ఉండేందుకు పుల్లెల గోపీచంద్, టోక్యో ఒలింపిక్స్‌కి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
గోపీచంద్ కోచింగ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత సైనా నెహ్వాగ్ కానీ, పీవీ సింధుకానీ స్థాయికి తగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నారు. మరి గోపీ లాంటి సీనియర్ కోచ్ గైడెన్స్ లేకుండా టోక్యోలో ఒలింపిక్ పతకం సాధించగలరా? అనేది హాట్ టాపిక్‌గా మారింది.