బ్యాడ్మింటన్‌లో పుల్లెల గోపిచంద్ కుమార్తె గాయత్రి దూసుకెళ్తోంది. ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీ అండర్-19లో బాలికల సింగిల్స్‌లో ఆమెకు టాప్ సీడ్ దక్కింది. ఆకర్షి కశ్యప్, మాలవిక, ఉన్నతి బిస్త్ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

అండర్-19 బాలుర విభాగంలో మైస్నమ్ మైరబా, శంకర్ ముత్తుస్వామి, సాయిచరణ్ తదితరులు సతీశ్ కుమార్, ఆకాశ్ యాదవ్ తదితరులు పోటీపడనున్నారు.

32 మంది బాలబాలికలు మెయిన్ డ్రాకు అర్హత సాధించగా.. బాలుర డబుల్స్‌లో డింకూ సింగ్-మంజిత్ సింగ్, బాలికల డబుల్స్‌లో త్రిషా జోలీ-వర్షిణీ, మిక్స్‌డ్ డబుల్స్‌లో నవనీత్-సాహితీ జోడీలు టాప్ సీడ్స్‌గా బరిలోకి దిగనున్నారు. ఈ టోర్నీలో సుమారు వెయ్యిమంది క్రీడాకారులు పాల్గొననున్నారు.