ప్రో కబడ్డి లీగ్ 2019 లో భాగంగా గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ గుజరాత్ ఫార్చూన్ జాయింట్స్ టాప్ లేపింది. యూపీ యోదాస్ ను సునాయాసంగా మట్టికరిపించి ఏకంగా 25 పాయింట్స్ తేడాతో ఘన విజయం సాధించింది. గుజరాత్ ఆధిక్యం సాధించిన్ని పాయింట్స్ కూడా యూపీ సాధించలేకపోయింది. ఈ విజయం ద్వారా గుజరాత్ పాయింట్స్ టేబుల్ లో టాప్ కు  చేరింది. 

ఈ మ్యాచ్ లో గుజరాత్ రైడర్స్, డిఫెండర్స్ సమిష్టిగా రాణించి యూపీని చిత్తుచేశారు. రైడర్స్ రోహిత్ 11, సచిన్ 6 ఆకట్టుకున్నారు. మిగతావారిలో పర్వేశ్ 6, మోరె 5, సోను 4, సునీల్ 2, అంకిత్ 2, సుమిత్ 1 పాయింట్స్ సాధించిన గుజరాత్ విజయంలో తమవంతు పాత్ర పోషించారు. 

ఇలా రైడింగ్ లో 23, ఒక సూపర్ రైడ్, ట్యాకిల్స్ లో 15, ఆల్ ఔట్స్ ద్వారా 6, ఎక్స్ ట్రా ల రూపంలో ఒకటి ఇలా మొత్తంగా పార్చూజ్ జాయంట్స్ కు 44 పాయింట్స్ తో అదరగొట్టింది. 

యూపి ప్రదర్శన విషయానికి వస్తే ఎందులోనూ గుజరాత్ కు పోటీనివ్వలేకపోయింది.  రైండింగ్ లో కేవలం 12, ట్యాకిల్స్ లో మరీ దారుణంగా 5, ఎక్స్ ట్రా ల రూపంలో 2 మొత్తం 19 పాయింట్స్ మాత్రమే సాధించింది. ఆటగాళ్లలో కూడా 5 పాయింట్స్ సాధించిన  శ్రీకాంతే హయ్యెస్ట్ స్కోరర్. ఇక మోను గోయట్ 2, అజాద్ 2, నితేశ్ 2, సుమిత్ 2, సురేందర్ గిల్ 2, సురేందర్ సింగ్ 1, అశు 1 పాయింట్ మాత్రమే  చేసి నిరాశపర్చారు. 

ఇలా గుజరాత్ ఆటగాళ్ల జోరు ముందు యూపీ నిలవలేకపోయింది. గత మ్యాచ్ లో మాదిరిగారనే పార్చూన్ జాయింట్స్ నలబై పైచిలుకు పాయింట్స్ సాధిస్తే యోదాస్ 19 వద్దే నిలిచిపోయింది. ఇలా 19-44 పాయింట్స్ తేడాతో గుజరాత్ ఘన విజయాన్ని అందుకుంది.