Asianet News TeluguAsianet News Telugu

Pro Kabaddi League:ప్రొ కబడ్డీ లీగ్.. గుజ‌రాత్ జెయింట్స్-తెలుగు టైటాన్స్ మ‌ధ్య తొలిపోరు, గెలిచేది ఎవరంటే..?

Telugu Titans-Gujarat Giants: పదో సీజ‌న్ లోకి అడుగుపెడుతున్న ప్రొ కబడ్డీ లీగ్ 2023 మొత్తం 12 న‌గ‌రాల్లో జ‌ర‌గ‌నుంది. అహ్మదాబాద్ లోని ట్రాన్స్‌స్టాడియా స్టేడియంలోని ఎరీనాలో మొద‌టి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.
 

Pro Kabaddi League 2023: Gujarat Giants vs Telugu Titans, Who will win the first match? RMA
Author
First Published Dec 2, 2023, 4:57 PM IST

Pro Kabaddi League 2023: 2014లో ప్రారంభమైన ప్రొ కబడ్డీ లీగ్‌ ఇప్పటిదాకా తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకుంది. శ‌నివారం నుంచి ప్రొ క‌బ‌డ్డీ లీడ్ 10 సీజ‌న్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో లీగ్‌ దశలో మొత్తం 132 మ్యాచ్‌లు జర‌గ‌నున్నాయి. మొద‌టి మ్యాచ్ గుజ‌రాత్ జెయింట్స్ - తెలుగు టైటాన్స్ మ‌ధ్య అహ్మదాబాద్ లోని ట్రాన్స్‌స్టాడియా స్టేడియంలోని ఎరీనాలో జ‌ర‌గ‌నుంది. రాత్రి 08:00 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. రెండు జట్ల స్క్వాడ్ గ‌మ‌నిస్తే.. 

తెలుగు టైటాన్స్ :

శంకర్ భీమ్‌రాజ్ గడై, ఓంకార్ ఆర్, గౌరవ్ దహియా, మోహిత్, అజిత్ పాండురంగ్ పవార్, రాబిన్ చౌదరి, పర్వేష్ భైన్‌వాల్, రజనీష్, మోహిత్, నితిన్, విజయ్, పవన్ సెహ్రావత్, హమీద్ మిర్జాయీ నాదర్, మిలాద్ జబ్బారి. 

గుజరాత్ జెయింట్స్:

సోంబిర్, వికాస్ జగ్లాన్, సౌరవ్ గులియా, దీపక్ రాజేందర్ సింగ్, రవి కుమార్, మోర్ జీబీ, జితేందర్ యాదవ్, నితేష్, జగదీప్, బాలాజీ డి, మనుజ్, సోను, రాకేష్, రోహన్ సింగ్, పార్తీక్ దహియా, ఫజెల్ అత్రాచలి, రోహిత్ గులియా, మహ్మద్ ఎస్మాయీల్ నబీబక్ష్, అర్కం షేక్. 

గుజరాత్ జెయింట్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ ముఖాముఖి రికార్డులు గ‌మ‌నిస్తే.. 

పీకేఎల్ చరిత్రలో గుజరాత్ జెయింట్స్, తెలుగు టైటాన్స్ జట్లు 8 సార్లు తలపడ్డాయి. ఇందులో గుజరాత్ జెయింట్స్ 7 సార్లు విజయం సాధించగా, తెలుగు టైటాన్స్ ఒక్క‌సారి మాత్ర‌మే విజయం సాధించింది. ప్రొ క‌బ‌డ్డీ  సీజన్ 9లో గుజరాత్ జెయింట్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్  డ్రాగా ముగిసింది. 

సీజన్ 9లో గుజరాత్ జెయింట్స్ vs తెలుగు టైటాన్స్ మధ్య గతంలో జరిగిన పోటీ గుజ‌రాత్ 44-30తో విజయం సాధించింది. మొత్తంగా గ‌త సీజ‌న్ లో 9 విజయాలు, 11 ఓటములు, 2 టైలతో, గుజరాత్ జెయింట్స్ పాయింట్ల పట్టికలో 59 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచింది.

కాగా, తెలుగు టైటాన్స్ గత సీజన్‌లో 15 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 12వ స్థానంలో నిలిచింది. రెండు గేమ్‌లు గెలిచి 20 సార్లు ఓడిపోయింది. ఇక ప్లేయ‌ర్ల రికార్డులు గ‌మ‌నిస్తే.. పీకేఎల్ కెరీర్లో 39 మ్యాచ్ ల‌లో 271 రైడ్ పాయింట్లు సాధించిన రాకేశ్ సీజన్ 10లో గుజరాత్ జెయింట్స్ తరఫున ప్రధాన రైడర్ గా ఉన్నాడు. తెలుగు టైటాన్స్ లో పవన్ సెహ్రావత్ ప్రధాన రైడర్. అతను 105 పీకేఎల్ మ్యాచ్‌లలో 29 సూపర్ రైడ్‌లతో సహా 987 రైడ్ పాయింట్‌లను సాధించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios