హోమ్ సిటీ...సొంత ప్రేక్షకులు...తెలుగు టైటాన్స్ జట్టు... తప్పని ఓటమి. ప్రో కబడ్డి సీజన్ 7 ఆరంభం నుండి సేమ్ సీన్. ఆరంభం మ్యాచ్ లో ముంబై చేతిలో ఓటమిని చవిచూసిన తెలుగు టైటాన్స్ జట్టు తాజాగా హైదరాబాద్ గచచ్చిబౌలి వేదికన జరిగిన  చివరి మ్యాచ్ లో కూడా సేమ్ అదే ప్రదర్శనను కనబర్చింది. ఇలా పాట్నా పైరేట్స్ చేతిలో ఏకంగా  14 పాయింట్స్ తేడాతో ఓటమిని చవిచూసింది. ఇలా వరుసగా నాలుగోసారి పరాజయంపాలయ్యింది.   

ఈ మ్యాచ్ లో పాట్నా  డిఫెండర్స్ అదరగొట్టారు. ఈ జట్టు రైండింగ్ ల కేవలం 12 పాయింట్స్ మాత్రమే సాధించి ట్యాకిల్స్ లో అత్యధికంగా 16 పాయింట్స్, ఆలౌట్ ద్వారా మరో 4 పాయింట్స్ అందుకుంది. ఎక్స్ ట్రాల రూపంలో 2 పాయింట్లతో మొత్తం 34 పాయింట్స్ సాధించింది. 

ఆటగాళ్లలో  ప్రదీప్ అత్యధికంగా 7 పాయింట్స్ సాధించాడు. మిగతావారిలో లీ జంగ్ కున్ 5, జయదీప్ 5, మోనే 4, నీరజ్ 3 పాయింట్లతో ఆకట్టుకున్నారు. మహ్మద్ ఇస్మాయిల్ 2, హదీ  2 పాయింట్స్ తో ఫరవాలేదనిపించారు. 

ఇక తెలుగు టైటాన్స్ ప్రదర్శన ఈ మ్యాచ్ లోనూ మారలేదు. సిద్దార్థ్  కేవలం 6 పాయింట్స్ తో సరిపెట్టగా  మిగతావారు ఆ దరిదాపుల్లోకి రాలేదు. అబోజర్ 2, విశాల్ 2, కృష్ణ 2, అంకిత్ 2 పాయింట్స్ అందించారు. ఇక ఫహద్ 1, అరుణ్ 1, మల్లిఖార్జున్ 1, సూరజ్ 1 పాయింట్ మాత్రమే సాధించారు. ఇలా ఆటగాళ్ళెవరూ రాణించకపోవడంతో కేవలం 22 పాయింట్స్ మాత్రమే టైటాన్స్ జట్టు సాధించింది. 

ఇలా టైటాన్స్ 22-34 పాయింట్స్ తేడాతో వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది.  ఈ మ్యాచ్ ద్వారా మొదటి వారాన్ని పూర్తిచేసుకున్న ప్రో కబడ్డీ లీగ్ 7 రెండో వారంలోకి అడుగుపెడతోంది. ఈ రెండో వారంలో మ్యాచులు మొత్తం ముంబైలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో  జరగనున్నాయి.