ఒక వైపే చూడొద్దు: తన ఆనందంపై ప్రీతి జింటా వివరణ

ఒక వైపే చూడొద్దు: తన ఆనందంపై ప్రీతి జింటా వివరణ

ముంబై:  ఢిల్లీ డేర్ డెవిల్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓటమిపై తాను సంతోషం వ్యక్తం చేసినట్లు వచ్చిన వార్తలపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని, ప్రీతి జింటా వివరణ ఇచ్చారు. పూణేలో జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ ఢిల్లీ చేతిలో ఓటమి వార్తను విని సంతోషం వ్యక్తం చేస్తూ ఆమె మాట్లాడినట్లు చెప్పే వీడియో సోషల్ మీడియాలో సందడి చేసింది.

ముంబై ఇండియన్స్ ఓడిపోతే పంజాబ్ కు ప్లే ఆఫ్ కు చేరుకునే అవకాశం వస్తుందని, చెన్నై సూపర్ కింగ్స్ తమ పంజాబ్ జట్టును ఓడించడంపై రాజస్థాన్ రాయల్స్ సంతోషపడే ఉంటుందని, ఎందుకంటే తమ ఓటమి వల్ల రాజస్థాన్ రాయల్స్ కు ప్లై ఆఫ్ బెర్త్ దక్కిందని ఆమె వివరించారు. 

ఒకవైపే చూడవద్దని, చివరి వరకు నీ విజయం కోసమే చూడకూడదని, అవతలి జట్టు ఓటమిని కూడా చూడాల్సి ఉంటుందని అన్నారు. ఈ సీజన్ లో తమ  జట్టు సరిగా ఆడకపోవడం పట్ల అభిమానులకు, మద్దతుదారులకు ఆమె విచారం వ్యక్తం చేశారు.

ముంబై ఇండియన్స్ ఓటమి తర్వాత చెన్నైపై విజయం సాధిస్తే పంజాబ్ కు ప్లే ఆఫ్ కు వెళ్లే అవకాశం ఉండేది. అయితే, చెన్నై చేతిలో పంజాబ్ ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. దాంతో ప్లే ఆఫ్ కు దూరమైంది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM SPORTS

Next page