Asianet News TeluguAsianet News Telugu

అబ్బా.. ఏం పట్టాడో...పాక్ క్రికెటర్ స్టన్నింగ్ క్యాచ్

పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ అజమ్ అందుకున్న స్టన్నింగ్ క్యాచ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది క్రికెట్‌గా మారింది. పాకిస్తాన్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ చివరి రోజు ఆటలో భాగంగా 128వ ఓవర్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న ఆసీస్ ఆటగాడు మిచెల్ స్టార్క్‌ తను ఎదుర్కొన్న బంతిని లెగ్‌సైడ్ దిశగా ఆడాడు.

pakistan cricketer babar azam took brilliant catch
Author
Dubai - United Arab Emirates, First Published Oct 12, 2018, 11:15 AM IST

పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ అజమ్ అందుకున్న స్టన్నింగ్ క్యాచ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది క్రికెట్‌గా మారింది. పాకిస్తాన్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ చివరి రోజు ఆటలో భాగంగా 128వ ఓవర్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న ఆసీస్ ఆటగాడు మిచెల్ స్టార్క్‌ తను ఎదుర్కొన్న బంతిని లెగ్‌సైడ్ దిశగా ఆడాడు.

అక్కడే షార్ట్ ఫార్వార్డ్ ఫీల్డర్‌గా ఉన్న బాబర్ అజమ్ డైవింగ్ చేస్తూ అద్బుతంగా క్యాచ్ పట్టాడు. ఈ స్టన్నింగ్ క్యాచ్‌కు క్రికెటర్లతో పాటు అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. మైదానమంతా కాసేపటి వరకు అరుపులు, కేకలతో దద్దరిల్లిపోయింది. దీనిపై సోషల్ మీడియాలోనూ బాబర్‌పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

తొలి టెస్టులో భారీ స్కోరు చేసిన పాకిస్తాన్.. ఆసీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచి విజయంపై ధీమాగా ఉంది.. అయితే ఉస్మాన్ ఖాజా 141, ట్రావిస్ హెడ్ 72, టీమ్ పైన్ 61 పరుగులు చేసి పాక్‌ను విజయానికి దూరం చేసి మ్యాచ్‌ను డ్రా చేశారు.
 
Follow Us:
Download App:
  • android
  • ios