Padma award 2024: రోహన్ బోపన్న, జోష్నా చినప్ప సహా ఏడుగురు క్రీడాకారులకు పద్మ అవార్డులు

Padma award 2024: టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్నతో పాటు మ‌రో ఏడుగురు క్రీడా ప్రముఖులకు కేంద్ర ప్ర‌భుత్వం పద్మశ్రీ పుర‌స్కారం ప్ర‌క‌టించింది. వీరిలో ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన స్క్వాష్ క్రీడాకారిణి జోష్నా చినప్ప, ఆర్చరీ కోచ్ పూర్ణిమ మహతో కూడా ఉన్నారు.
 

Padma Awards 2024: 7 Famous sports personalities conferred with Padma Shri, Joshna Chinappa Rohan Bopanna RMA

Padma award 2024 - Sports: భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ అవార్డుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ అవార్డును అందుకోబోయే వారిలో ప‌లువురు క్రీడాకారులు కూడా ఉన్నారు. భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న, స్క్వాష్ క్రీడాకారిణి జోష్నా చిన్నప్ప సహా ఏడుగురు భారత క్రీడాకారులు 2024 పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. ఈ అవార్డును భారత రాష్ట్రపతి ప్రతి సంవత్సరం మార్చి-ఏప్రిల్ లో రాష్ట్రపతి భవన్ లో ప్రదానం చేస్తారు. 

ఈ ఆటగాళ్లకు 2024లో ప‌ద్మ వార్డులు.. 

  1. రోహన్ బోపన్న - టెన్నిస్ - కర్ణాటక
  2. జోష్నా చినప్ప - స్క్వాష్ - తమిళనాడు
  3. ఉదయ్ విశ్వనాథ్ దేశ్ పాండే - మల్ఖంబ్ - మహారాష్ట్ర
  4. గౌరవ్ ఖన్నా- పారా బ్యాడ్మింటన్- ఉత్త‌ర‌ప్ర‌దేశ్ 
  5. సతేంద్ర సింగ్ లోహియా - స్విమ్మింగ్ - మ‌ధ్య‌ప్ర‌దేశ్
  6. పూర్ణిమా మహతో - విలువిద్య - జార్ఖండ్
  7. హర్బిందర్ సింగ్ - పారాలింపిక్ విలువిద్య - ఢిల్లీ

IND v ENG: క్లీన్ బౌల్డ్ తో ఔటైన త‌ర్వాత కూడా న‌వ్వ‌డ‌మేంటి సామి.. ! బెన్ స్టోక్స్ వైర‌ల్ వీడియో !

132 మందికి పద్మ అవార్డులు

2024 సంవత్సరానికి గాను కేంద్ర ప్ర‌భుత్వం 132 మందికి పద్మ అవార్డులను ప్ర‌క‌టించింది. ఇందులో ఐదు పద్మవిభూషణ్, 17 ప‌ద్మ‌ భూషణ్, 110 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. రాష్ట్రపతి అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ లో ప్రతి ఏటా ఈ కార్యక్రమం జరుగుతుంది. సాధారణంగా ఈ కార్యక్రమం మార్చి-ఏప్రిల్ మధ్య జరుగుతుంది.

రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ.. !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios