Asianet News TeluguAsianet News Telugu

IND v ENG: క్లీన్ బౌల్డ్ తో ఔటైన త‌ర్వాత కూడా న‌వ్వ‌డ‌మేంటి సామి.. ! బెన్ స్టోక్స్ వైర‌ల్ వీడియో !

India vs England: హైదరాబాద్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌ మొద‌టి ఇన్నింగ్స్ లో భార‌త బౌల‌ర్ల విజృంభ‌ణ‌తో 246 పరుగులు చేసి ఇంగ్లీష్ జట్టు ఆలౌట్ అయింది. అయితే, ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (70 ప‌రుగులు) ఔట్ అయిన త‌ర్వాత న‌వ్వుతూ గ్రౌండ్ లో క‌నిపించ‌డం వైర‌ల్ అవుతోంది.   
 

England captain Ben Stokes started laughing after being dismissed, know what happened in IND v ENG? Jasprit Bumrah RMA
Author
First Published Jan 26, 2024, 12:15 PM IST | Last Updated Jan 26, 2024, 12:15 PM IST

India vs England - Ben Stokes : భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్ తొలి రోజు మ్యాచ్ లో భార‌త్ పై చేయి సాధించింది. తొలి రోజు భారత బౌలింగ్ పై ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ భారీ స్కోరు చేయడంలో విఫలమయ్యారు. ఇంగ్లాండ్ బాజ్ బాల్ వ్యూహం బెడిసికొట్ట‌లింది. అయితే, ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కెప్టెన్ కు సంబంధించిన ఒక వీడియో దృశ్యాలు వైర‌ల్ అవుతున్నాయి. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మంచి ఇన్నింగ్స్ ఆడ‌టంతో ఆ జ‌ట్టు 246 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు భారీ స్కోర్ సాధించలేదు. ఈ ఇన్నింగ్స్ లో క్లీన్ బౌల్డ్ తో  ఔటైనప్పటికీ ఇంగ్లండ్ కెప్టెన్  నవ్వుతూ క్రీజును వీడ‌టం వైర‌ల్ అవుతోంది.

హైద‌రాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో టెస్టు మ్యాచ్ తొలి రోజు కనిపించిన దృశ్యం చూస్తే ఎవరూ ఆశ్చర్యపోరు. ఇంగ్లాండ్ జట్టు తన 'బాజ్ బాల్ స్టైల్'లో బ్యాటింగ్ చేయ‌డానికి ప్లాన్ చేసింది. అయితే, భార‌త పిచ్ ల‌పై అంత సులభం కాదని టీమిండియా నిరూపించింది. ఎందుకంటే భారత స్పిన్నర్లు తమ బౌలింగ్ మాయాజాలాన్ని ప్రదర్శించారు. భారీ స్కోర్ చేయ‌కుండా ఇంగ్లాండ్ ను క‌ట్ట‌డి చేశారు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఒక్క‌డే ఆ జ‌ట్టు త‌ర‌ఫున బ్యాటింగ్ లో రాణించి 70 ప‌రుగులు చేశాడు.

అభిమానులతో అట్లుంట‌ది మ‌రి.. ఉప్ప‌ల్ గ్రౌండ్ లో రోహిత్ శ‌ర్మ పాదాల‌ను తాకిన అభిమాని.. !

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో బెన్ స్టోక్స్ 70 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ స్పిన్ ముందు ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ దూకుడుగా ఆడేందుకు ప్ర‌య‌త్నించినా పెద్ద స్కోర్ చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. వ‌రుస వికెట్లు ప‌డుతున్న బెన్ స్టోక్స్ గోడ‌లా నిలిచి బ్యాటింగ్ చేస్తున్న స‌బ‌యంలో జస్ప్రీత్ బుమ్రా చాకచక్యంగా బౌలింగ్ చేసి దెబ్బ‌కొట్టాడు. 65వ ఓవర్ మూడో బంతికి బుమ్రా వికెట్ చుట్టూ వచ్చి బంతిని లెగ్ స్టంప్ వైపు వెళ్తున్న మిడిల్ స్టంప్ లైన్ పై వేశాడు. స్టోక్స్ ఈ లైన్ లో ఆడటానికి వెళ్లాడు కానీ, ఇందులో విఫ‌లం కావ‌డంతో బౌల్డ్ అయ్యాడు.

స్టోక్స్ ఔటైన తర్వాత న‌వ్వుతూ.. 

బుమ్రా వేసిన బంతి మిడిల్ స్టంప్ లైన్ పై బాగా పడి ఆ తర్వాత కాస్త బయటకు వెళ్లడంతో స్టంప్స్ ను తాక‌డంతో స్టోక్స్ ఔటయ్యాడు. దీంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. వికెట్ తీసిన తర్వాత బుమ్రా నవ్వుతూ సంబరాలు చేసుకుంటున్నాడు.. ఇదే స‌మ‌యంలో బెన్స్ స్టోక్స్ కూడా తన చిరునవ్వును దాచుకోలేకపోయాడు. నిజానికి ఈ చిరునవ్వుతో బుమ్రా సామర్థ్యాన్ని చూసి తాను మోసపోయానని, దానికి తన వద్ద సమాధానం లేదని స్టోక్స్ అంగీకరించాడని చెప్ప‌వ‌చ్చు.

 

అభిమానులతో అట్లుంట‌ది మ‌రి.. ఉప్ప‌ల్ గ్రౌండ్ లో రోహిత్ శ‌ర్మ పాదాల‌ను తాకిన అభిమాని.. !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios