ODI World Cup 2023 : వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నోర్జే ఆటకు దూరం.. దక్షిణాఫ్రికాకు భారీ షాక్..

వరల్డ్ కప్ కు ముందు దక్షిణాఫ్రికాకు భారీ షాక్ తగిలింది. దక్షిణాఫ్రికా స్టార్ పేసర్, వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నోర్జే గాయం కారణంగా ఆటకు దూరం కానున్నాడు. 

ODI World Cup 2023 : World class fast bowler Anrich Nortje is out for world cup, Big shock for South Africa - bsb

వన్డే ప్రపంచ కప్ 2023కు ముందే దక్షిణాఫ్రికాకు పెద్ద షాక్ తగిలింది.  వన్డే ప్రపంచ కప్ 2023 భారత్ వేదికగా జరగనున్నసంగతి తెలిసిందే.  ఈ క్రమంలో దక్షిణాఫ్రికా స్టార్ పేసర్, వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నోర్జే గాయం కారణంగా ఈసారి వరల్డ్ కప్ కు దూరం అవ్వబోతున్నట్లుగా సమాచారం. అన్రిచ్ నోర్జే ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. దీని నుండి కోలుకోవడానికి నోర్జేకు రెండు నెలల సమయం పట్టనున్నట్లుగా తెలుస్తోంది.

29 ఏళ్ల నోర్జే ఆస్ట్రేలియాతో రెండో వన్డే సందర్భంగా తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని చికిత్స కోసం జోహాన్నస్ బర్గ్ కు  పంపించారు. దక్షిణాఫ్రికా క్రికెట్ టీం అతనికి మెరుగైన చికిత్స అందించడానికి ఈ మేరకు చర్యలు తీసుకుంది. ఈ క్రమంలోనే నోర్జే సిరీస్ లోని మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యాడు. 15మంది సభ్యుల ప్రోటిస్ జట్టును దక్షిణాఫ్రికా వరల్డ్ కప్ కు ప్రకటించింది. ఈ జట్టులో నోర్జే ఉన్నాడు.

ODI World Cup 2023 : అదరగొట్టిన సిరాజ్.. మళ్లీ నెంబర్ వన్ స్థానం అతనిదే.. తండ్రికోసం భావోద్వేగ పోస్ట్...

కానీ ఇప్పుడు జట్టులో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో దక్షిణాఫ్రికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. మరోవైపు మెగాటోర్నీకి ఎంపికైన ప్రోటీస్ పేసర్ సిసంద మగల కూడా మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. అయితే ఈ గాయాల నుంచి కోలుకొని వరల్డ్ కప్ టైంకి పూర్తి ఫిట్నెస్ తో వస్తాడని నివేదికలు చెబుతున్నాయి. ఈ వరల్డ్ కప్ 2023 మెగా ఈవెంట్ లో సౌత్ ఆఫ్రికా అక్టోబర్ 7న తొలి మ్యాచ్లో భాగంగా శ్రీలంకతో ఢిల్లీ వేదికగా తలపడబోతోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios