Asianet News TeluguAsianet News Telugu

ODI World Cup 2023 : అదరగొట్టిన సిరాజ్.. మళ్లీ నెంబర్ వన్ స్థానం అతనిదే.. తండ్రికోసం భావోద్వేగ పోస్ట్...

హైదరాబాదీ కుర్రాడు మహ్మద్ సిరాజ్ మరోసారి అదరగొట్టాడు. ఆసియా కప్ ఫైనల్లో భారత విజయానికి కీలకంగా వ్యవహరించి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో తిరిగి నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 

ODI World Cup 2023 : Siraj Number one position, Emotional post for father - bsb
Author
First Published Sep 21, 2023, 8:55 AM IST

దుబాయ్ : భారత స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో తిరిగి నంబర్ వన్ ర్యాంక్ సాధించాడు. శ్రీలంకపై అద్భుత ప్రదర్శనతో ఆసియా కప్ ఫైనల్లో భారత్ విజేతగా నిలిచింది.  ఈ విజయంలో సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. ఈ ఆటలో అతను కనబరిచిన ప్రతిభతో ఏకంగా 8 స్థానాలు ఎగబాకాడు. మళ్లీ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. అంతకుముందు ఈ ఏడాది జనవరిలో తొలిసారిగా టాప్ ర్యాంక్ సాధించాడు సిరాజ్.

ఆ తర్వాత కొద్ది కాలానికి ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్ వుడ్ కు తన స్థానాన్ని కోల్పోయాడు. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడు స్థానాలు చేజార్చుకుని తొమ్మిదవ ర్యాంకులో ఉండిపోయాడు. ఇక మరోవైపు ఆటలోకి తిరిగి వచ్చిన పేసర్ బూమ్రా రెండు స్థానాలు మెరుగయ్యాడు. దీంతో రెండు స్థానాలు మెరుగయ్యాడు. 27వ ర్యాంకులో ఉన్నాడు. 50వ ర్యాంకులో హార్దిక్ పాండ్యా ఉన్నాడు. 

భారత వాలీబాల్ జట్టు ప్రభంజనం.. దక్షిణ కొరియాను ఓడించి, నాకౌట్ దశకు చేరిక..

ఇక మరోవైపు బ్యాటర్లలో ఓపెనర్లైన శుభ్ మన్ గిల్, రోహిత్ శర్మలు ఈ ర్యాంకుల్లో వరుసగా రెండో స్థానం, పదో స్థానాలను నిలబెట్టుకున్నారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఒక స్థానం మెరుగయ్యాడు. దీంతో ఎనిమిదవ ర్యాంకులో నిలిచాడు. ఇక ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఆరో స్థానాన్ని  దక్కించుకున్నాడు. భారత పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఆసియా కప్ ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన తర్వాత తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. 

ఈ మేరకు ఇంస్టాగ్రామ్ లో  ఓ భావోద్వేగా పోస్టును పంచుకున్నాడు.  తన కెరీర్ లో అత్యుత్తమ దశను చూస్తున్న సిరాజ్ కొద్దికాలం క్రితం చనిపోయిన తండ్రిని గుర్తు చేసుకున్నాడు. ‘మిస్ యూ పాపా’ అంటూ క్యాప్షన్ పెట్టి..  రెండు ఫోటోలు షేర్ చేశాడు. ఒక ఫోటోలో.. తన తల్లిదండ్రులు తనను ఆశీర్వదిస్తున్నట్టు ఉన్న ఫోటోను చూస్తున్న తల్లిదండ్రుల ఫోటో ఒకటి కాగా..  తాను గ్రౌండ్లో ఆడుతున్న ఫోటో ఒకటి. 

అంతర్జాతీయ క్రికెట్ మండలి వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్ లో సిరాజ్ 694 పాయింట్లతో నెంబర్ వన్ గా నిలిచాడు. మొన్నటి వరకు తొమ్మిదవ స్థానంలో ఉన్న హైదరాబాదీ పేసర్ ఏకంగా 8 స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ ఆనంద క్షణాలను పంచుకోవడానికి తన తండ్రిని మిస్సవుతున్నానని  భావోద్వేగానికి లోనయ్యాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios