Asianet News TeluguAsianet News Telugu

వన్డే ప్రపంచ కప్ 2023 : న్యూజిలాండ్ కు గుడ్ న్యూస్.. కేన్ విలియమ్సన్ వచ్చేశాడు..

వన్డే ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ కు గుడ్ న్యూస్ వచ్చింది. కేన్ విలియమ్సన్ తిరిగి జట్టులోకి వచ్చాడు.  

ODI World Cup 2023 : Good news for New Zealand, Kane Williamson has arrived - bsb
Author
First Published Oct 13, 2023, 11:00 AM IST

వన్డే ప్రపంచ కప్ 2023లో న్యూజిలాండ్ దూసుకుపోతోంది. వరుసగా మూడో విజయం మీద కన్నేసింది. శుక్రవారం చెన్నై వేదికగా ఈ మెగాటోర్నీలో బంగ్లాదేశ్ తో న్యూజిలాండ్ తెలపడనున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ పై విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న న్యూజిలాండ్ కు ఈ మ్యాచ్ కు ముందే ఓ గుడ్ న్యూస్ కూడా అందింది. న్యూజిలాండ్ జట్టు రెగ్యులర్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్లో బరిలో దిగనున్నాడు.

వన్డే ప్రపంచ కప్ మెగా టోర్నీలో ఇప్పటివరకు జరిగిన తొలి రెండు మ్యాచ్లకు కేన్ విలియంసన్  గాయం కారణంగా దూరమయ్యాడు. ఇప్పుడు కేన్ పూర్తి ఫిట్నెస్ తో కంబ్యాక్ ఇస్తున్నాడు. కెన్ విలియమ్స్ అని రాకతో న్యూజిలాండ్ జట్టు మరింత బలంగా తయారు కానుంది. ఐపీఎల్ 2023 సీజన్ సందర్భంగా  కేన్ విలియమ్సన్ గాయపడ్డాడు.  అప్పటినుండి కివీస్ జట్టుకు దూరంగానే ఉంటున్నాడు.

వన్డే ప్రపంచ కప్ 2023 మెగా టోర్నీ ప్రారంభానికి ముందు జరిగిన రెండు వార్మపు మ్యాచ్లో కూడా కేన్ బ్యాటింగ్ చేశాడు. కానీ మ్యాచ్ మధ్యలోనే రిటైర్ హార్ట్ గా వెనకకు తిరిగాడు. ప్రస్తుతం కేంద్ర తన ఫిట్నెస్ను నిరూపించుకొని రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. స్టార్ పెసర్ టిమ్ సౌథీ ఇంకా పూర్తిగా ఫిట్నెస్ సాధించలేదు. సౌథీ  చేతి వేలిగాయంతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం జరగనున్న బంగ్లాదేశ్ మ్యాచ్ లో కూడా వెస్టిండీస్ కి సౌథీ దూరమయ్యే ఛాన్సే కనిపిస్తుంది.

 ఇక ఇప్పటికే ప్రకటించిన వరల్డ్ కప్ లోని న్యూజిలాండ్ జట్టు ఈ విధంగా ఉంది..

కెప్టెన్ గా కేన్ విలియమ్సన్, డెవాన్ కాన్వే, డారిల్ మిచెల్,  టామ్ లాథమ్ ( వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర,  గ్లెన్ ఫిలిప్స్,  మార్క్  చాప్మన్,  మిచెల్ సాంట్నర్,  లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్డ్, విల్ యంగ్, జేమ్స్ నీషమ్, టిమ్ సౌథీ, ఇష్ సోథీ.

Follow Us:
Download App:
  • android
  • ios