ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నొవాక్ జొకోవిచ్.. 23వ గ్రాండ్‌స్లామ్‌తో చరిత్ర సృష్టించిన టెన్నిస్ దిగ్గజం..

ఫ్రెంచ్ ఓపెన్ 2023 టైటిల్ నెగ్గిన జొకోవిచ్, కెరీర్‌లో 23వ గ్రాండ్‌స్లామ్ సొంతం చేసుకుని, టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా సరికొత్త చరిత్ర

Novak Djokovic wins french open 2023, record breaks with 23th grand slam title overtakes Rafael nadal CRA

సెర్భియన్ టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్, వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. ఫ్రెంచ్ ఓపెన్ 2023 టైటిల్ నెగ్గిన జొకోవిచ్, కెరీర్‌లో 23వ గ్రాండ్‌స్లామ్ సొంతం చేసుకుని, టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా సరికొత్త చరిత్ర క్రియేట్ చేశాడు..

10 సార్లు ఆస్ట్రేలియాన్ ఓపెన్ నెగ్గిన నొవాక్ జొకోవిచ్, ఏడు సార్లు వింబుల్డన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. మూడు సార్లు యూఎస్ ఓపెన్ నెగ్గిన జొకో, మూడోసారి ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గి... 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన రఫెల్ నాదల్‌ని అధిగమించేశాడు..

నార్వే టెన్నిస్ ప్లేయర్ల కాస్పర్ రుడ్‌తో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ 2023 ఫైనల్‌‌ని 7-6, 6-3, 7-5 తేడాతో సొంతం చేసుకున్నాడు నొవాక్ జొకోవిచ్.   24 ఏళ్ల నార్వే టెన్నిస్ ప్లేయర్ కాస్పర్ రుడ్, మొదటి గ్రాండ్‌స్లామ్ టైటిల్ కల, జొకోవిచ్ దూకుడు కారణంగా నెరవేరలేకపోయింది.. గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ చేతుల్లో 6-3, 6-3, 6-0 తేడాతో ఓడిన కాస్పర్ రుడ్, వరుసగా రెండోసారి ఫైనల్ చేరి రికార్డు క్రియేట్ చేసినా... ఈసారి జోకొవిచ్ కారణంగా రెండోసారి రన్నరప్‌గా నిలిచాడు.. 

 

23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో తన రికార్డును బ్రేక్ చేసిన నొవాక్ జొకోవిచ్‌కి రఫెల్ నాదల్, సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపాడు. ‘ఈ అద్భుతమైన అఛీవ్‌మెంట్ సాధించినందుకు నీకు కంగ్రాట్స్. కొన్నేళ్ల క్రితం 23 నెంబర్‌ అసాధ్యమైనదిగా కనిపించింది. నువ్వు దాన్ని సుసాధ్యం చేశావు... నీ కుటుంబంతో టీమ్‌తో కలిసి ఈ విజయాన్ని ఎంజాయ్ చేసుకో...’ అంటూ ట్వీట్ చేశాడు రఫెల్ నాదల్.. 

నొవాక్ జొకోవిచ్ 10 సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిస్తే, మట్టి కోర్టు వీరుడిగా గుర్తింపు తెచ్చుకున్న రఫెల్ నాదల్, 14 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచాడు. స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ 8 సార్లు వింబుల్డన్ టైటిల్ గెలిచాడు. 

20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన స్విస్ టెన్నిస్ ప్లేయర్ రోజర్ ఫెదరర్, 2022 జూన్‌లో రిటైర్మెంట్ ప్రకటించగా గాయం కారణంగా 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్‌తో ఉన్న రఫెల్ నాదల్, ఫ్రెంచ్ ఓపెన్ 2023 టోర్నీలో పాల్గొనలేదు.  గత సీజన్ 2022 ఫ్రెంచ్ ఓపెన్‌ క్వార్టర్ ఫైనల్‌లో నొవాక్ జొకోవిచ్, రఫెల్ నాదల్ చేతిలో 2-6, 6-4, 2-6, 6-7 తేడాతో ఓడిపోవడం కొసమెరుపు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios