CWG 2022: భారత్‌కు పతకాలు ఖాయం చేసిన బాక్సర్లు.. హాకీలో సెమీస్‌కు టీమిండియా..

Commonwealth Games: మహిళల 45 కేజీల  క్వార్టర్ ఫైనల్స్ లో యువ బాక్సర్ నీతూ గంగాస్.. పురుషుల  57 కేజీల  విభాగంలో హుసాముద్దీన్.. జూడోలో తులిక మన్ భారత్ కు పతకాలు ఖాయం చేశారు. 

Nitu Ganghas, Hussamuddin and Tulika mann Assured medals For India, women's Hockey Team Advances to Semis in CWG 2022

కామన్వెల్త్ క్రీడలలో భాగంగా ఆరోరోజు భారత క్రీడాకారులు  పతకాల సంఖ్యను పెంచేందుకు క‌ృషి చేస్తున్నారు. తప్పక  పతకం సాధించే ఈవెంట్లు పెద్దగా లేకున్నా త్వరలోనే వాటిని  సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. బాక్సింగ్‌లో మహ్మద్ హుుసాముద్దీన్, నీతూ గంగాస్ లు భారత్ కు పతకం ఖాయం చేశారు. మరో మహిలా జూడో క్రీడాకారిణి తులికా మన్ కూడా భారత్ కు పతకం  గ్యారెంటీ ఇచ్చింది.  ఇక భారత మహిళల హాకీ జట్టు.. సెమీస్ కు చేరింది. 

మహిళల 45 కేజీల  క్వార్టర్ ఫైనల్స్ లో యువ బాక్సర్ నీతూ గంగాస్.. క్వార్టర్స్ పోరులో నికోల్ క్లైయిడ్ ను ఓడించింది. నార్తర్న్ ఐర్లాండ్ కు చెందిన  నికోల్  క్లైయిడ్ పై ఏబీడీ (ఒక బాక్సర్ గాయపడినా, ఆట జరుగుతుండగానే  స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకున్నా ప్రత్యర్థిని విజేతగా ప్రకటించే విధానం) ద్వారా విజయం సాధించింది. తద్వారా సెమీస్ కు చేరుకుంది. 

కామన్వెల్త్ గేమ్స్ -2018లో  కాంస్యం గెలిచిన హుసాముద్దీన్..  పురుషుల  57 కేజీల  విభాగంలో 4-1 తేడాతో నమీబియాకు చెందిన బాక్సర్ ఎన్.టీ. మార్నింగ్ పై గెలిచాడు. తద్వారా  సెమీస్ కు అర్హత సాధించాడు.  ఫలితంగా నీతూతో పాటు హుసాముద్దీన్ భారత్ కు పతకం ఖాయం చేశారు. 

హాకీలో.. 

బుధవారం పూల్-ఏలో భాగంగా జరిగిన క్వార్టర్స్ లో భారత మహిళల హాకీ జట్టు  కెనడాపై 3-2 తేడాతో నెగ్గింది.  భారత  హాకీ ప్లేయర్లలో సలైమా 3వ నిమిషంలోనే గోల్ చేయగా నవ్నీత్ కౌర్ 22వ నిమిషంలో గోల చేసి భారత ఆధిక్యాన్ని 2-0కు పెంచింది. అయితే అదే సమయంలో కెనడా కూడా పుంజుకుంది. ఆట 23వ నిమిషంలో  బ్రియాన్ స్టేర్స్ గోల్ కొట్టగా.. 39వ నిమిషంలో  హన్నా గోల్  చేసింది.  ఇక ఆట చివరిఅంకంలో  51వ నిమిషంలో సంగీత కుమారి గోల్ కొట్టడంతో భారత్ విజయం సాధించింది.  

జూడోలో.. 

జూడో పోటీలలో భాగంగా బుధవారం జరిగిన  మహిళల  78 కిలోల ఈవెంట్ సెమీస్ లో భారత్ కు చెందిన తులిక మన్..  న్యూజిలాండ్ కు చెందిన సిడ్నీ  ఆండ్రూస్ ను ఓడించి ఫైనల్ కు అర్హత సాధించింది. తద్వారా భారత్ కు స్వర్ణం, రజతంలో ఏదో  ఒక పతకం ఖాయం చేసింది.  ఫైనల్ లో ఆమె స్కాట్లాండ్ కు చెందిన సారా అడ్లింగ్టన్ తో పోటీ పడనుంది. 

 

అంతకుముందు  పురుషుల వెయిట్ లిఫ్టింగ్ లో భారత  వెయిట్ లిఫ్టర్ లవ్‌ప్రీత్ సింగ్..   109కిలోల విభాగంలో  కాంస్యం నెగ్గాడు. స్నాచ్ లో 163 కిలోల బరువు ఎత్తిన లవ్‌ప్రీత్..  క్లీన్ అండ్ జెర్క్ లో 192 కిలోలను ఎత్తి కాంస్యాన్ని సొంతం చేసుకున్నాడు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios