ఆస్ట్రియా ఫార్ములా వన్ దిగ్గజం నికీ లాడా(70) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు అధికారికంగా ప్రకటించారు.

మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన నికీ.. 1975, 1977, 1984లో టైటిల్స్‌ సొంతం చేసుకున్నారు. అత్యుత్తమ ఎఫ్‌-1 రేసర్‌గా పేరుగాంచిన ఆయన ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. 1976లో జరిగిన ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. తోటి రేసర్ల సాయంతో అప్పట్లో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. ఆ గాయాల నుంచి కోలుకున్న ఆరు వారాల్లోనే తిరిగ రేసింగ్ పాల్గొని చరిత్ర సృష్టించిన ఘనత ఆయనది.   1949లో ఆస్ట్రియాలో జన్మించిన నిక్కీ.. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో  ఫార్మాల్‌ వన్‌ రేసులో అత్యుత్తమ స్థాయి వరకు ఎదిగారు