క్రికెటర్ రాహుల్ తో కలిసి డిన్నర్ కు వెళ్లా: నాగ చైతన్య హీరోయిన్

Nidhhi Agerwal reacts on dating cricketer KL Rahul
Highlights

టీం ఇండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ ముంబై బాంద్రా ప్రాంతంలో బాలీవుడ్ నటి నిధి అగర్వాల్‌తో కనిపించిన సంఘటన సంచలనం సృష్టించింది.

టీం ఇండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ ముంబై బాంద్రా ప్రాంతంలో బాలీవుడ్ నటి నిధి అగర్వాల్‌తో కనిపించిన సంఘటన సంచలనం సృష్టించింది. వీరిద్దరు కలిసి ఉన్న ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. వారిద్దరు డేటింగ్‌లో ఉన్నారని ప్రచారం ఊపందుకుంది. 

దానిపై నిధి అగర్వాల్ స్పందించింది. తనకు రాహుల్ ఎప్పటి నుంచో తెలుసునని, సరదాగా కలుసుకున్నామని నిధి ఆమె చెప్పింది. తామిద్దం డేటింగ్‌లో లేమని తెలిపింది. "అవును, నేను రాహుల్‌ కలిసి డిన్నర్‌కి వెళ్లాము. నాకు రాహుల్ ఎప్పటి నుంచో తెలుసు"  అని చెప్పింది. 

రాహుల్ క్రికెటర్ కాక ముందు, తాను నటిని కాక ముందు నుంచే తమ  మధ్య పరిచయం ఉందని,. తామిద్దరం బెంగళూరులో ఒకే కాలేజీకి వెళ్లకపోయినా తమ మధ్య చాలా కాలంగా పరిచయం ఉందని నిధి తెలిపింది.
 
ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకి రాహుల్ ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగమైన అర్థ శతకం సాధించి కొత్త రికార్డును నెలకొల్పాడు. 
అయితే ఈ సీజన్ మధ్యలో రాహుల్ బెంగళూరుకు చెందిన ఎలిగ్జర్ నహర్ అనే మోడల్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం నిధి అగర్వాల్ చందు ముండేటి దర్శకత్వం వహిస్తున్న చిత్రం సవ్యసాచిలో నటిస్తోంది. నాగ చైతన్యకు జోడీగా ఆమె నటిస్తోంది.

loader