నెయ్‌మర్ ఓవరాక్షన్.. ‘ఆస్కార్ ఇవ్వాల్సిందే’.. ఫ్యాన్స్ ‌కామెంట్లు 

దూకుడైన ఆటతీరుతో పాటు సరికొత్త ఫ్యాషన్స్‌ను అభిమానులకు పరిచయం చేసే బ్రెజిల్ స్టార్ ఆటగాడు నెయ్‌మర్‌‌కు వివాదాలతో అంతకంటే ఎక్కువ పాపులారిటీ సంపాదించాడు. తీవ్రమైన అసహనంతో ప్రత్యర్థి ఆటగాళ్లను కొరికిన సందర్భాలు కోకొల్లలు. తాజాగా మెక్సికోతో జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో మనోడు చేసిన ‘అతి’ ఫిఫాలో చర్చనీయాంశమైంది. ఆ రోజు మ్యాచ్‌ 70వ నిమిషంలో నెయ్‌మర్ బాల్‌ను డ్రిబిల్ చేసుకుంటూ టచ్‌ లైన్‌ వైపుకు వెళుతున్నాడు.

ఈ క్రమంలో మెక్సికో ఆటగాడు మిగ్యూల్ బంతిని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించాడు.. ఈ సమయంలో అతని కాలు నెయ్‌మర్ కాలికి తగిలింది.. అంతే అతను కిందపడి నొప్పి భరించలేక విలవిల్లాడిపోతున్నట్లు మైదానంలో అటు ఇటు పొర్లాడాడు. ఇది చూస్తున్న వారికి పాపం నిజంగా ఎంత పెద్ద దెబ్బ తగిలిందో అన్న అనుమానం కలిగింది. కానీ అంతలోనే లేచి మళ్లీ మెరుపు వేగంతో మెక్సికో గోల్ పోస్ట్ వైపు దాడులు చేశాడు. అంతే అవాక్కవ్వడం అభిమానుల వంతైంది..

ఈ ఘటనతో ఫుట్‌బాల్ ప్రపంచం అతని తీరుపై మండిపడింది.. నెయ్‌మర్ ఇటువంటి కళలో సిద్ధహస్తుడని.. అతని నటనకు కచ్చితంగ ‘ఆస్కార్’ ఇవ్వాలని.. ఇంకా అతను డొర్లుతూనే ఉన్నాడేమో అంటూ సోషల్ మీడియాలో ట్రాలింగ్ మొదలెట్టారు. మరోవైపు నెయ్‌మర్ ప్రవర్తన పట్ల మెక్సికో కోచ్ జువాన్ కార్లియో మండిపడ్డారు..

అతని ఓవర్ యాక్షన్ వల్ల 4 నిమిషాల పాటు మ్యాచ్‌ను నిలిపివేశారు.. విలువైన సమయం వృథా అయ్యింది. మా ఆటగాళ్లు తీవ్ర అసహనానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, బ్రెజిల్ కోచ్ మాత్రం నెయ్‌మర్‌ను వెనకేసుకు వచ్చాడు. మిగ్యూల్ నెయ్‌మర్ కాలిని తొక్కడం వల్లే అతను బాధతో విలవిల్లాడిపోయాడని చెప్పాడు.

Scroll to load tweet…