వర్తు వర్మ వర్తు.! వీళ్లు సైలెంట్‌గా పెద్ద ప్లానే వేశారుగా.. ఆ ప్లేయర్స్ ఎవరంటే.?
PBKS: ఐపీఎల్ 2026 ఆక్షన్ కోసం పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తమ వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి. పంజాబ్ కింగ్స్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్, వికెట్ కీపర్, పేసర్, స్పిన్నర్ కోసం చూస్తుండగా.. లక్నో సూపర్ జెయింట్స్ నంబర్ 3 బ్యాటర్..

ఆ జట్ల వ్యూహాలు ఇలా..
ఐపీఎల్ 2026 ఆక్షన్ కోసం పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తమ వ్యూహాలను సిద్దం చేశాయి. లాస్ట్ సీజన్‌లో ఆకట్టుకున్న పంజాబ్ కింగ్స్ రూ. 11.50 కోట్ల పర్స్‌తో బరిలోకి దిగుతోంది. ఆ జట్టుకు క్వాలిటీ కోర్ టీమ్ ఉన్నప్పటికీ.. మిడిల్ ఆర్డర్ బ్యాటర్, ఒక వికెట్ కీపర్, ఒక భారతీయ పేసర్, ఒక స్పిన్నర్ అవసరం.
పంజాబ్ టార్గెట్ వీరే
లియామ్ లివింగ్‌స్టోన్, డారిల్ మిచెల్, దసున్ శనక, టిమ్ షెఫర్డ్, ఫిన్ అలెన్, జేమీ స్మిత్ లాంటి ఆటగాళ్లు పంజాబ్ ఫ్రాంచైజీలు లక్ష్యాలు. దేశీయ సర్క్యూట్ నుంచి ముఖ్తార్ హుస్సేన్, సుశాంత్ మిశ్రా, పృధ్వి రాజ్ యారా, అకీబ్ నబీ, విఘ్నేష్ పుత్తుర్ లాంటి ప్రతిభ ఉన్న యువ ఆటగాళ్ల కోసం పంజాబ్ కింగ్స్ గురి పెట్టింది.
లక్నో పర్స్ ఇలా ఉంది..
మరోవైపు, లక్నో సూపర్ జెయింట్స్ రూ. 22.90 కోట్ల భారీ పర్స్‌తో వేలంలోకి వస్తోంది. మహమ్మద్ షమీని ట్రేడ్ ద్వారా తీసుకున్న ఈ జట్టు.. అర్జున్ టెండూల్కర్‌ను కూడా తీసుకోవడంతో తన బలాన్ని పెంచుకుంది. అయితే, ఆ జట్టుకు నంబర్ 3 స్థానంలో ఒక భారతీయ బ్యాటర్ అవసరం ఉంది. అతడి కోసం లక్ష్యంగా పెట్టుకున్నారు.
లక్నో స్లాట్స్ ఇలా..
ఆ స్లాట్‌తో పాటు లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ఒక భారతీయ ఓపెనర్, ఒక భారతీయ స్పిన్నర్, ఒక భారతీయ ఫినిషర్, ఒక విదేశీ పేసర్, ఒక విదేశీ స్పిన్ ఆల్ రౌండర్ అవసరం ఉంది. ఈ స్లాట్లలో బలమైన ఆటగాళ్లను భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే వేలంలో కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉంది.
లక్నో టార్గెట్ వీరేనా
వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, తుషార్ రహేజా, రాహుల్ చహర్, తనుష్ కోటియన్, సల్మాన్ నిజార్, సోను యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, అన్రిచ్ నోకియా, వనిందు హసరంగ లాంటి ఆటగాళ్లను లక్నో సూపర్ జెయింట్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రెండు జట్లు తమ బలహీనతలను సరిచేసుకుని.. టైటిల్ గెలవాలనే ఆశతో ఉన్నాయి.

