భారత్, న్యూజిలాండ్ మహిళా జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హామిల్టన్‌లో జరిగిన చివరి టీ20లో భారత్ 2 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌.. భారత బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.

కివీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన భారత్‌ క్రమం తప్పకుండా వికెట్లను పొగొట్టుకుంది. స్టార్ ఓపెనర్ స్మృతీ మంధాన ధాటిగా బ్యాటింగ్ చేసింది.. ఫోర్లు, సిక్సర్లతో ఆమె 86 పరుగులు చేసింది.

చివరి వరుస బ్యాట్స్‌మెన్లు విఫలమవ్వడంతో భారత్‌ 2 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ విజయంతో న్యూజిలాండ్ 3 టీ20ల మ్యాచ్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ రెండు కూడా న్యూజిలాండ్ క్రికెటర్ సోపీ డివైన్‌కే దక్కాయి.