ఫిఫా వరల్డ్‌కప్‌లో హాట్ ఫేవరేట్లలో ఒక జట్టుగా పేరొందని అర్జెంటీనా తన స్థాయికి తగ్గ ఆటతీరును కనబరచడం లేదు.. ముఖ్యంగా క్రొయేషియా చేతిలో దారుణంగా ఓడిపోవడంతో మెస్సీ సేనపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి.. కెప్టెన్ మెస్సీ జట్టును సరిగా నడిపించడం లేదంటూ అభిమానులు మండిపడుతుండగా.. తాజాగా అతని భార్ అంటోనెల్లాను నెటిజన్లు వదలడం లేదు... క్రొయేషియాతో మ్యాచ్‌కు ముందు అంటోనెల్లా తన ఇన్‌స్టాగ్రమ్‌లో ఒక పోస్ట్ పెట్టడమే ఇందుకు కారణం..

తన మూడేళ్ల కుమారుడితో ఉన్న ఫోటోను పోస్ట్ చేసి.. దానికి క్యాప్షన్‌గా వోమెస్‌పాపి అంటే గోడాడి అని పెట్టి తన భర్తకు చీర్స్ చెప్పింది.. అయితే అర్జెంటీనా జట్టుపైనా.. మెస్సీపైనా భారీ అంచనాలు పెట్టుకున్న అభిమానులకు.. క్రొయేషియా షాక్ ఇచ్చింది.. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో క్రొయేషియా 3-0తో అర్జెంటీనాను ఓడించింది. దీనిని జీర్ణించుకోలేని ఫ్యాన్స్‌ మెస్సీ భార్య పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు...

‘మీ నాన్న ఒక లూజర్’ అని..‘ మీ నాన్న త్వరలోనే స్వదేశానికి వచ్చేస్తాడులే’ అని నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. మరొకరైతే ‘టోర్నీ నుంచి నిష్క్రమించడానికి అర్జెంటీనా చాలా దగ్గర్లో ఉంది.. ఇంట్లో కూర్చొని మెస్సీ మ్యాచ్‌లు చూడొచ్చని’ మరో నెటిజన్ అన్నాడు..