ఫిట్‌నెస్‌ చాలెంజ్‌: సైనా పేరెంట్స్‌పై ప్రశంసలు (వీడియో)

Netizens cheers saina parents
Highlights

ఫిట్‌నెస్‌ చాలెంజ్‌: సైనా పేరెంట్స్‌పై ప్రశంసలు 

 భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తల్లిదండ్రులపై సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ పిలుపునిచ్చిన ఫిట్‌నెస్‌ చాలెంజ్‌కు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. దిగ్గజ క్రీడాకారుల నుంచి సినీ తారలు, సామన్య ప్రజల అందరూ.. తమ ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలను షేర్‌ చేస్తూ.. సన్నిహితులకు సవాల్‌ విసురుతున్నారు. రాథోడ్‌ విసిరిన సవాల్‌ను స్వీకరించిన సైనా సైతం జిమ్‌ వర్కౌట్స్‌ వీడియోను షేర్‌ చేస్తూ.. బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు, టాలీవుడ్‌ హీరో రానా దగ్గుబాటి, క్రికెటర్‌ గౌతం గంభీర్‌లను చాలెంజ్‌ చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ ఫిట్‌ నెస్‌ చాలెంజ్‌ను సైనా తల్లిదండ్రులు స్వీకరించడం ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది. సైనా తల్లి ఉషా నెహ్వాల్‌ ఏకంగా జిమ్‌లో పెద్ద పెద్ద బరువులు ఎత్తుతూ ..ఎంతో మంది యువతీ, యువకులకు స్పూర్తిగా నిలిచారు. సైనా తండ్రి సైతం జిమ్‌లో సైక్లింగ్‌ చేస్తూ ‘హమ్‌ఫిట్‌తో ఇండియా ఫిట్‌’  కార్యక్రమంలో భాగమయ్యాడు. వీరి ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలను సైనానే తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో సైనా తల్లితండ్రులపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. స్పూర్తినికలిగిస్తున్నారని కొందరంటే.. ‘ఫిట్‌ ఫాదర్‌.. ఫిట్‌ మదర్‌.. ఫిట్‌ డాటర్‌.. ఫిట్‌ ఇండియా’ అంటూ ఇంకొందరు కామెంట్‌ చేస్తున్నారు.

"

loader