Asianet News TeluguAsianet News Telugu

గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా నేషనల్ రికార్డు... పావో నుర్మీ గేమ్స్‌లో రజతం కైవసం...

ఫిన్‌లాండ్‌లో జరుగుతున్న పావో నుర్మీ గేమ్స్‌లో పాల్గొంటున్న నీరజ్ చోప్రా..  89.30 మీటర్ల దూరం విసిరి సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పిన జావెలిన్ త్రో అథ్లెట్...

Neeraj Chopra creates new National record in Paavo Nurmi Games
Author
India, First Published Jun 15, 2022, 11:49 AM IST

టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా... మరోసారి అంతర్జాతీయ వేదికపై అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు. టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో ఈవెంట్‌లో 87.58 మీటర్ల దూరం విసిరి, స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా, అంతకుముందు గత ఏడాది మార్చిలో పటియాలాలో జరిగిన ఈవెంట్‌లో 88.07 మీటర్ల దూరం విసిరి జాతీయ రికార్డు క్రియేట్ చేశాడు..

తాజాగా ఫిన్‌లాండ్‌లో జరుగుతున్న పావో నుర్మీ గేమ్స్‌లో పాల్గొంటున్న నీరజ్ చోప్రా, 89.30 మీటర్ల దూరం విసిరి అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన నమోదు చేశాడు. అయినప్పటికీ ఈ గేమ్స్‌లో నీరజ్ చోప్రాకి రజతం లభించడం విశేసం. 89.83 మీటర్ల దూరం విసిరిన ఫిన్‌లాండ్ జావెలిన్ త్రో అథ్లెట్ ఓలీవర్ హెలండర్‌ టాప్‌లో నిలిచి, స్వర్ణం సాధించాడు...

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తర్వాత నీరజ్ చోప్రాకి ఇదే మొట్టమొదటి ప్రదర్శన. 24 ఏళ్ల నీరజ్ చోప్రా కెరీర్ గ్రాఫ్, టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి, చరిత్ర సృష్టించిన తర్వాత పూర్తిగా మారిపోయింది. ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ గెలిచినా పెద్దగా గుర్తింపు దక్కించుకోలేకపోయిన నీరజ్ చోప్రా, ఒలింపిక్ గోల్డ్ తర్వాత ఇండియన్ సూపర్ స్టార్‌గా మారిపోయాడు.

ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో 121 ఏళ్ల తర్వాత భారత్‌కి స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా... టోక్యో నుంచి వచ్చిన తర్వాత చాలా బిజీ బిజీగా గడిపాడు. సన్మాన కార్యక్రమాలు, సత్కారలు, సభలు, సమావేశాలు... ఇలా క్షణం తీరిక లేకుండా తిరగడం వల్ల మనోడికి జ్వరం కూడా వచ్చేసింది...

ఈ మధ్య కాస్త తీరక దొరకడంతో కుటుంబంతో కలిసి విహార యాత్రలకు వెళ్లొచ్చిన నీరజ్ చోప్రా, కొన్ని వ్యాపార ప్రకటనల్లోనూ కనిపిస్తూ యూత్‌కి మరింత చేరువవుతున్నాడు.  నీరజ్ చోప్రా అనేక బ్రాండ్లకు మోడల్‌గా, బ్రాండ్ అంబాసిడర్‌గా మారడంతో 10 నెలలుగా పోటీలకు దూరమయ్యాడు. టోక్యో ఒలింపిక్స్ 2020 తర్వాత నీరజ్ చోప్రా, ఓ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడం ఇదే తొలిసారి... 

టోక్యో ఒలింపిక్స్ విజయం తర్వాత ప్రకటించినట్టుగానే నీరజ్‌కి రూ.కోటి నగదు పారితోషికం అందించిన చెన్నై సూపర్ కింగ్స్, నీరజ్ చోప్రా పేరుతో జెర్సీని కానుకగా ఇచ్చింది. ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడానికి కారణమైన 87.58 మీటర్లకు గుర్తుగా 8758 నెంబర్‌తో జెర్సీని రూపొందించింది చెన్నై సూపర్ కింగ్స్... అలాగే నీరజ్ చోప్రాకి వస్తున్న గుర్తింపు గమనించిన మహీంద్ర సంస్థ, ఫ్లాగ్ ఫిష్ ఎస్‌యూవీ700లో ప్రత్యేకంగా జావెలిన్ ఏడిషన్‌ను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ ఏడిషన్‌లో వచ్చే తొలికారు కూడా నీరజ్ చోప్రాకే బహుకరిస్తామని ఆనంద్ మహీంద్ర తెలిపారు...

Follow Us:
Download App:
  • android
  • ios