Asianet News TeluguAsianet News Telugu

క్రికెట్ చరిత్రలో అద్భుత ఘట్టం.. 6 బంతుల్లో 6 వికెట్లు.. 

క్రికెట్ చరిత్రలోనే ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఎవ్వరూ ఊహించని విధంగా ఒకే ఓవర్ లో 6 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు ఓ బౌలర్. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఇంతకీ ఆ బౌలర్ ఎవరూ? ఆ మ్యాచ్ ఎక్కడ జరిగిందంటే..? 

Mudgeeraba captain Gareth Morgan picked 6 wickets off 6 balls KRJ
Author
First Published Nov 13, 2023, 6:20 PM IST

6 Wickets in 6 Balls: క్రికెట్ చాలా క్రేజ్ అయినా ఆట.. ఈ ఆటలో ఎప్పుడూ  ఏం జరుగుతుందో ఏమీ చెప్పలేము. వేసుకున్నా అంచనాలు ఒకే ఓవర్ లో.. ఒక్కోసారి ఒక్క బంతితో తారుమారు కావొచ్చు. ఈ గేమ్ స్పెషాలిటీ ఏంటంటే ఇందులో అసాధ్యమైనంటూ ఏదీ లేదు. తాజాగా ఓ ఆస్ట్రేలియా బౌలర్ అసాధ్యమైన ఓ ఫిట్ ను సుసాధ్యం చేశాడు. క్రికెట్ చరిత్రలోనే ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతం చేశాడు. ఎవ్వరూ ఊహించని విధంగా ఒకే ఓవర్ లో 6 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.

వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్ ప్రీమియర్ లీగ్ డివిజన్ త్రీ క్రికెట్ క్లబ్ లో ఈ  అద్భుత రికార్డు నమోదైంది. ఈ క్లబ్ క్రికెట్ లో భాగంగా తాజాగా ముగ్గీరాబా నెరంగ్  వర్సెస్ సర్ఫర్స్ ప్యారడైజ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మడ్గీరబా జట్లు  బౌలర్ గారెత్ మోర్గాన్ రికార్డు  క్రియేట్ చేశాడు. ప్యారడైజ్ జట్టు గెలువలంటే.. కేవలం 5 పరుగులు కొడితే చాలు.. పైగా వారిచేతిలో 6 వికెట్లు ఉన్నాయి. ఈ దశలో ముగ్గీరాబా నెరంగ్  జట్టు ఖరారైందని అందరూ భావించారు.  

ఈ తరుణంలో గారెత్ మోర్గాన్ కు బౌలింగ్ వేసే అవకాశం వచ్చింది. ఎవ్వరూ ఊహించని విధంగా చివరి ఓవర్ లో 6 బంతుల్లో 6 వికెట్లు పడగొట్టాడు.  దీంతో సర్ఫర్స్ ప్యారడైజ్  జట్టు తిరుగులేని విజయాన్ని సాధించింది. 40 ఓవర్లలో 179 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సర్ఫర్స్ ప్యారడైజ్ చివరి ఓవర్‌కు 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. అయితే మ్యాచ్ చివరి ఆరు బంతుల్లో మోర్గాన్ ఆరు వికెట్లు తీసి నాలుగు పరుగుల తేడాతో తన జట్టుకు విజయాన్ని అందించాడు. తొలి బంతికే ఖాతా తెరవకుండానే సర్ఫర్స్‌లోని చివరి ఐదుగురు బ్యాట్స్‌మెన్ ఔట్ కావడంతో జట్టు 174 పరుగులకే కుప్పకూలింది.

అంతర్జాతీయ మీడియా ప్రకారం.. చివరి ఓవర్ మొదటి నాలుగు బంతుల్లో బ్యాట్స్‌మెన్ క్యాచ్‌ అవుట్ కాగా.. చివరి రెండు బంతుల్లో బ్యాట్స్‌మెన్ బౌల్డ్ అయ్యారు. మోర్గాన్ ఏడు ఓవర్లలో 16 పరుగులిచ్చి ఏడు వికెట్లు తీశాడు. ముగ్గీరాబా ఇన్నింగ్స్‌లో మోర్గాన్ 39 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 

ప్రొఫెషనల్ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు న్యూజిలాండ్‌కు చెందిన నీల్ వాగ్నర్, బంగ్లాదేశ్‌కు చెందిన అల్ అమీన్ హుస్సేన్ , భారతదేశానికి చెందిన అభిమన్యు మిథున్‌ల పేరిట ఉంది. వీరు ఒకే ఓవర్‌లో ఐదు వికెట్లు పడగొట్టారు. 

Follow Us:
Download App:
  • android
  • ios