స్పోర్ట్స్ డెస్క్: IPL 2020 సీజన్‌లో భాగంగా గురువారం కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మద్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాను అందించింది. ఆధిక్యం చేతులు మారుతూ సాగిన  మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆఖరి బంతికి విజయం అందుకుంది. సీఎస్కే విజయానికి 2 బంతుల్లో 7 పరుగులు కావాల్సినదశలో ఆఖరి రెండు బంతుల్లో 2 సిక్సర్లు బాది విజయాన్ని అందించాడు రవీంద్ర జడేజా. దీంతో అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. 

ఈ క్రమంలోనే సీఎస్కె కెప్టెన్ ధోని భార్య సాక్షి కూడా జడేజా ఆటకు ఫిదా అయినట్లున్నారు. అందువల్లే అతడి ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ పేజిలో పోస్ట్ చేసిన సాక్షి ''బాప్ రె బాప్(ఓ మై గాడ్)'' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. 

read more  రుతురాజ్ ఆటను మరుగునపడేసిన కరోనా... లేదంటే ఎప్పుడో: ధోని

మొత్తంగా మొదట బ్యాటింగ్ కు దిగిన కెకెఆర్ 173 పరుగుల టార్గెట్‌ ధోని సేన ముందుంచింది. అయితే లక్ష్యచేదనలో సీఎస్కెకు ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు. మొదటి వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత 14 పరుగులు చేసిన షేన్ వాట్సన్ అవుట్ అయ్యాడు. అంబటి రాయుడు 20 బంతుల్లో 38 పరుగులు చేసి అవుట్ కాగా... ఎమ్మెస్ ధోనీ 1 పరుగుకే మరోసారి వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 

53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 72 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్... వరుసగా సీజన్‌లో రెండో హాఫ్ సెంచరీ నమోదుచేశాడు. శామ్ కర్రాన్ 13, రవీంద్ర జడేజా (11 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో) 31 పరుగులు చేశాడు.