చివరిసారిగా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లేందుకు జీవా నాకు కంపెనీ ఇచ్చింది (వీడియో)
ఆటలతో అందరి హృదయాలను ఈ క్యూట్ బేబి గెలుచుకుంది. ధోనీ తాజాగా తన ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియోను పోస్టు చేశాడు. పుణె మైదానం నుంచి ధోనీ తన కూతురు జీవాతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లే సమయంలో తీసిన వీడియో ఇది. మెల్లగా మెట్లు ఎక్కుతూ డ్రెసింగ్ రూమ్ వైపు కదిలారు. ఈ సీజన్‌లో చివరిసారిగా పుణె అభిమానులకు ధోనీ, జివా చేతులు ఊపి అభివాదాలు తెలిపారు. ఈ ఏడాది ఐపీఎల్‌లో చివరిసారిగా పుణె డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లేందుకు జీవా నాకు కంపెనీ ఇచ్చింది. మమ్ముల్ని ఎంతగానో ప్రోత్సహించిన పుణెకు ధన్యవాదాలు. మ్యాచ్‌ల సమయంలో మైదానం అంతా పసుపు రంగులోకి మార్చేశారు. మా ఆట ద్వారా మిమ్మల్ని బాగా సంతోషపెట్టాం అని అనుకుంటున్నాను’ అని పేర్కొన్నాడు.
