ధోనీ: తొలి ప్రేయసి గురించి చెప్పి సాక్షికి చెప్పొద్దన్నాడు

MS Dhoni reveals his firs crush and says do not tell sakshi
Highlights

తన తొలి ప్రేమ తీపి గుర్తులను పంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆ విషయాలను తన భార్య సాక్షికి మాత్రం చెప్పొద్దని వేడుకున్నాడు.

చెన్నై: తన తొలి ప్రేమ తీపి గుర్తులను పంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆ విషయాలను తన భార్య సాక్షికి మాత్రం చెప్పొద్దని వేడుకున్నాడు. ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో తన తొలి ప్రేమ గురించి వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ - తన తొలి ప్రేయసి ఎవరో చెప్పేశాడు  తాను 12వ తరగతిలో ఉన్నప్పుడు చివరిసారిగా కలిసినట్లు తెలిపాడు. అయితే ఈ విషయం తన భార్య సాక్షితో మాత్రం చెప్పొద్దని అక్కడి వాళ్లతో అన్నాడు. ఆ మాటలకు అక్కడి వారంతా నవ్వుల్లో తేలిపోయారు.

ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ మ్యాచుల్లో ధోనీ ఇరగదీస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఆడే అన్ని మ్యాచులకు కూడా భార్య సాక్షి, కూతురు జీవా హాజరవుతున్నారు. 

ఐపిఎల్ 2018 సీజన్ లో ధోనీ పది మ్యాచులు ఆడి 360 పరుగులు చేశాడు. పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్ బెర్త్ ను ఖాయం చేసుకున్నట్లే. దాంతో ధోనీ కల్ట్ కొనసాగుతోంది. క్రికెట్ అభిమానులు ఆయన సెన్సెషనల్ హిట్టింగ్స్ కు తెగ మురిసిపోతున్నారు.

loader