ఆఖరి టీ20 లో రెండు ప్రపంచ రికార్డులు సాధించిన ధోని

MS Dhoni Makes Two World Records in a T20 Match
Highlights

ఇంగ్లాడ్ తో జరిగిన టీ20 సీరీస్ ను టీంఇండియా 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. చివరి నిర్ణయాత్మక మ్యాచ్ లో రోహిత్ చెలరేగి సెంచరీ చేసి టీమిండియాకు విజయం సాధించి పెట్టాడు. అయితే ఇదే మ్యాచ్ లో వికెట్ కీఫర్ గా మహేంద్ర సింగ్ ధోని రెండు ప్రపంచ రికార్డును సాధించాడు. ఇప్పటివరకు ప్రపంచ టీ20 క్రికెట్ లో ఎవరూ సాధించని ఘనతను ధోనీ సాధించాడు.

చివరి టీ20 లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ లైనప్ ని పెవిలియన్ కు పంపడంలో ధోని ముఖ్య పాత్ర వహించారు.  వికెట్ కీఫర్ గా ధోని ఏకంగా ఆరుగురు బ్యాట్స్ మెన్స్ ని ని ఫెవిలియన్ బాట పట్టించడంతో బౌలర్లకు సహకరించారు. ఇందులో ఐదు క్యాచ్ లతో పాటు ఓ రనౌట్ ఉంది. ఇలా ఒకే టీ20 మ్యాచ్ లో ఐదు క్యాచ్ లు అందుకున్న మొదటి వికెట్ కీఫర్ గా ధోని చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు ఏ వికెట్ కీఫర్ కూడా ఈ ఘనత సాధించలేడు. ఈ అరుదైన రికార్డు ఎంఎస్ ధోని ఖాతాలోకి చేరింది. 

చివరి నిర్ణయాత్మక టీ20 లో ధోనీ జేసన్‌ రాయ్‌, హేల్స్‌, మోర్గాన్‌, స్టోక్స్‌, బెయిర్‌స్టో క్యాచ్ లను అందుకున్నాడు. దీంతో ఒక టీ20 మ్యాచ్‌ లో ఐదు క్యాచ్‌లను అందుకున్న తొలి వికెట్‌ కీపర్‌గా చరిత్రకెక్కాడు. అంతేకాకుండా 50కి పైగా క్యాచ్‌లను అందుకున్న తొలి కీపర్‌గానూ నిలిచాడు.  ఇప్పటివరకు ధోనీ అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో 54 క్యాచ్‌ లను అందుకున్నారు. అంతే కాకుండా టీ20 లో అత్యధిక స్టంపింగ్స్(33) రికార్డు కూడా ధోని పేరిటే ఉండటం విశేషం.

loader