ఆసియాకప్ లో భారత జట్టు విజయాలకు బ్రేక్ వేసి పసికూన అప్ఘాన్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. భారత్ పై అప్ఘాన్ విజయం సాధించకపోయినా మ్యాచ్ ను టై చేసి దాదాపు గెలిచినంత పని చేసింది. టీంఇండియాకు ఎన్నో అధ్భుత విజయాలను అందించిన ధోని రెండెళ్ల తర్వాత మళ్లీ కెప్టెన్సీ భాద్యతలు వహించిన మ్యాచే ఇలా టై కావడం క్రికెట్ అభిమానులను నిరాశ పర్చింది. అయితే భారత్, అప్ఘాన్ మ్యాచ్ ఫలితం పరంగా నిరాశపర్చినా...మరో రెండు రికార్డులను మాత్రం ధోనీ ఖాతాలోకి చేర్చింది. 

రెగ్యులర్ టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కి సెలెక్టర్లు విశ్రాంతినివ్వడంతో ఆసియా కప్ టోర్నీలో రోహిత్ సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. అయితే అప్పటికే వరుస విజయాలతో ఫైనల్ కు దూసుకుపోయిన టీంఇండియా అప్ఘాన్ తో నామమాత్రపు మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవడంతో ఎంఎస్ ధోనీ రెండేళ్ల తర్వాత మరోసారి జట్టు పగ్గాలు అందుకున్నాడు.

ఈ క్రమంలో 199 వన్డేల వద్ద ధోని కెప్టెన్సీకి బ్రేక్ పడగా... తాజా అవకాశంతో రెండొందల వన్డేకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇలా అత్యధిక వన్డేలకు కెప్టెన్ గా వ్యవహరించి ధోనీ రికార్డు నెలకొల్పాడు. దీంతో పాటు మరో అరుదైన రికార్డును కూడా ధోనీ బద్దలుగొట్టాడు. అతి పెద్ద వయసులో 37 ఏళ్ల వయసులో భారత జట్టుకు కెప్టెన్ గా ధోనీ వ్యవహరించాడు. దీంతో ఇప్పటివరకు అజారుద్దిన్ ( 36 ఏళ్లు) పేరిట వున్న ఈ రికార్డు ధోనీ ఖాతాలోకి చేరింది.

ఆలా అప్ఘాన్ మ్యాచ్ లో కెప్టెన్ గా విఫలమయినా...అదే కెప్టెన్సీలో రెండు రికార్డులు నెలకొల్పారు జార్ఖండ్ డైనమైంట్ మహేంద్ర సింగ్ ధోనీ.

మరిన్ని వార్తలు

మ్యాచ్ టై: భారత్ ను వణికించిన అఫ్గానిస్తాన్

రాహుల్.. ఇదంతా నీవల్లే.. నెటిజన్ల మండిపాటు