ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఒత్తిడికి తట్టుకుని నిలబడి... జట్టును ముందుండి నడిపించి ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించి పెట్టాడు టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ. మానసిక నిపుణులు సైతం ఆశ్చర్యపోయేంతటి ఆత్మస్థైర్యం మహేంద్రుడి సొంతం
ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఒత్తిడికి తట్టుకుని నిలబడి... జట్టును ముందుండి నడిపించి ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించి పెట్టాడు టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ. మానసిక నిపుణులు సైతం ఆశ్చర్యపోయేంతటి ఆత్మస్థైర్యం మహేంద్రుడి సొంతం. అందుకే వారు కూడా ధోనీని చూసి స్ట్రెస్ మేనేజ్‌మెంట్ ఎలా చేయాలో నేర్చుకోమంటారు. అసలు ఆ టాలెంట్ ధోనీకి ఎలా వచ్చిందన్నది చాలా మందికి సందేహం.
ఇదే డౌట్ బాలీవుడ్ సింగర్ రాహుల్ వైద్యకు కూడా వచ్చింది. వాళ్లని వీళ్లని అడగడం ఎందుకని డైరెక్ట్‌గా ధోనీనే అడిగాడు రాహుల్. కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత ప్రపుల్ పటేల్ కుమారుడు పూర్ణా పటేల్ వివాహ వేడుకకు భార్య, కూతురితో పాటు హాజరయ్యాడు ధోనీ.. ఈ సందర్భంగా రాహుల్.. ధోనీతో ముచ్చటించారు. ఈ క్రమంలో ‘ బాత్‌రూంలో కూడా ఇంత కూల్‌గా ఎలా ఉంటారు’ అంటూ వాష్‌రూమ్‌లో ధోనీతో గడిపిన క్షణాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు.. అది ఇప్పుడు వైరల్ అయ్యింది.
