ఇంగ్లాండు, ఇండియా రెండో వన్డేలో మ్యారేజ్ ప్రపోజల్

Marriage Proposal During 2nd ODI At Lord's Goes Viral
Highlights

లార్డ్స్‌  మైదానంలో ఇంగ్లాండ్‌, భారత్‌ల మధ్య జరిగిన రెండో వన్డేలో విచిత్రమైన సన్నివేశం చోటు చేసుకుంది. మ్యాచ్‌ చూడడానికి వచ్చిన ఓ వ్యక్తి  మోకాళ్లపై కూర్చొని తన గర్ల్‌ఫ్రెండ్‌కు మ్యారేజ్‌ ప్రపోజల్‌ చేశాడు.

లండన్‌: లార్డ్స్‌  మైదానంలో ఇంగ్లాండ్‌, భారత్‌ల మధ్య జరిగిన రెండో వన్డేలో విచిత్రమైన సన్నివేశం చోటు చేసుకుంది. మ్యాచ్‌ చూడడానికి వచ్చిన ఓ వ్యక్తి  మోకాళ్లపై కూర్చొని తన గర్ల్‌ఫ్రెండ్‌కు మ్యారేజ్‌ ప్రపోజల్‌ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దీంతో సిగ్గుతో మొగ్గయిన ఆ యువతి తర్వాత అతని ప్రపోజల్‌కు పచ్చజెండా ఊపింది. అతను ఇచ్చిన రింగ్‌ను స్వీకరించింది. దీంతో స్టేడియంలో సందడి చోటు చేసుకుంది. ఈ దృశ్యాలు టీవీలో కూడా ప్రసారం అయ్యాయి. 

కామెంటేటర్స్‌ కూడా దీనిపై  స్పందించారు. ఆ సమయంలో బౌలింగ్‌ చేస్తున్న భారత బౌలర్‌ చాహల్‌ కూడా క్లాప్స్‌ కొడుతు వారికి శుభాకాంక్షలు తెలిపాడు.

అయితే ఆ వ్యక్తి ప్రపోజ్‌ చేసిన సమయంలో "డెసిషన్‌ పెండింగ్‌ "  అంటూ.. ఆమె అతని ప్రపోజల్‌ అంగీకరించిన తర్వాత  "షీ సెడ్‌ యస్‌ " అంటూ టీవీ తెరపై  ప్లాష్‌ ఇచ్చారు. కొద్ది క్షణాల్లోనే ఈ వీడియో, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా అయ్యాయి. 

ఆ తర్వాత వారిద్దరిని కామెంటేటర్స్‌ బాక్స్‌లోకి పిలిచిన ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డ్‌ అధికారులు వారికి చిన్నపాటి బహుమతి కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. 

 

loader