సైకిల్ తో ధోనీ వెరైటీ స్టంట్, దీని పేరేంటో చెప్పండి చూద్దాం?(వీడియో)

Mahendra Singh Dhoni doing funny bicycle stunt
Highlights

ఇంగ్లాండ్ పర్యటనను ముంగించుకుని స్వదేశానికి వచ్చిన ఎమ్మెస్ ధోనీకి విరామం దొరకడంతో సమయాన్నంతా తన కుటుంబంతోనే గడుపుతున్నారు. జార్ఖండ్‌లోని తన ఇంట్లోనే భార్య సాక్షి, కూతురు జీవాలతో ఆనందంగా గడుపుతున్నాడు. అయితే క్రికెట్ లోనే కాదు తన జీవితంలోనూ ఎప్పుడూ ఛాలెంజ్ లు కోరుకునే ఈ మాజీ కెప్టెన్ కూల్ స్కూభా డైవింగ్ వంటి సాహసాలను చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఎమ్మెస్ చేసిన ఓ  సైకిల్ స్టంట్ సోషల్ మీడిమాలో చక్కర్లు కొడుతోంది. 

ధోనీ తన నోట్లో ఓ చెక్క ముక్క పెట్టుకుని, చెవులకు హెడ్ సెట్ పెట్టుకుని ఓ చిన్న సైకిల్ పై స్టంట్ చేశాడు. కాళ్లను నేలకు తాకకుండా ఉంచి సైకిల్‌ను ముందుకు పోనిస్తూ ఏదో సాహసం చేశాడు. ఈ వీడియోను ధోనీ స్వయంగా తన ఇన్స్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. సరదాగా ఈ సాహసం చేశాను,మీరు కూడా ఇళ్లలో దీన్ని ప్రయత్నించండి అంటూ వీడియోకు జతగా పోస్ట్ పెట్టాడు.  అయితే ఈ వీడియో చూసిన చాలామందికి అందులో ధోనీ ఏం స్టంట్ చేశాడో అర్థం కాక మళ్లీ మళ్లీ చూస్తున్నారు. అయినా అర్థం కాక పోవడంతో తమ ప్రెండ్స్‌కి, తెలిసినవారికి ఇదేం స్టంటో చెప్పాలంటూ సవాల్ విసురుతున్నారు.

ఈ క్రింది వీడియోను చూసి ఇందులో ధోనీ చేసే స్టంట్ ఏంటో మీరూ గెస్ చేయండి. 

Just for fun, plz try it at home.

A post shared by M S Dhoni (@mahi7781) on Jul 31, 2018 at 5:09am PDT

loader