ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు పసిడి పతకాల పంట.. లవ్లీనాకూ స్వర్ణం..
Lovlina Borgohein: ఢిల్లీ వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ లో భారత్ కు పసడి పతకాల పంట పండింది. ఆదివారం భారత్ కు రెండు స్వర్ణాలు లభించాయి.
న్యూఢిల్లీ వేదకగా జరుగుతున్న మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ లో భారత్‌కు మరో పసిడి పతకం దక్కింది. టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం నెగ్గిన భారత బాక్సర్ లవ్లీనా బోర్గో హెయిన్.. 5-2 తేడాతో ఆస్ట్రేలియాకు చెందిన కైత్లిన్ పార్కర్ పై విజయం సాధించింది. 75 కిలోల విభాగంలో పోటీ పడ్డ లవ్లీనాకు వరల్డ్ ఛాంపియన్‌షిప్ లో స్వర్ణం సాధించడం ఇదే ప్రథమం. లవ్లీనా విజయంతో ఈ పోటీలలో భారత్ స్వర్ణాల సంఖ్య నాలుగుకు చేరింది.
లవ్లీనా కంటే ముందు నీతూ గంగాస్ (48 కిలోలు), స్వీటీ బురా (81 కేజీలు), తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ (50 కేజీలు) స్వర్ణాలు గెలుచుకున్న విషయం తెలిసిందే.
గతంలో రెండు సార్లు ఆసియా ఛాంపియన్ అయిన వియాత్నాం క్రీడాకారిణి గుయెన్ టాన్‌పై 5-0 తేడాతో నిఖత్ బంపర్ విక్టరీ కొట్టింది. ఈ విజయంతో ఆమె వరుసగా రెండోసారి వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ గెలిచిన రెండో భారత బాక్సర్ గా చరిత్ర సృష్టించింది. గతేడాది ఇస్తాంబుల్ వేదికగా జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ లో విజేతగా నిలిచిన నిఖత్.. తాజాగా ఈ విజయంతో వరుసగా రెండోసారి ఛాంపియన్ గా నిలిచింది. గతంలో భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ పేరిట ఈ రికార్డు ఉంది.
ఇస్తాంబుల్ లో 52 కేజీల విభాగంలో స్వర్ణం క సాధించిన నిఖత్.. తాజా పోటీలలో మాత్రం 50 కేజీల విభాగంలో పోటీ పడుతోంది. ఫైనల్ లో గుయెన్ టాన్ పై ఆద్యంతం ఆధిపత్యం చెలాయించిన నిఖత్.. ప్రత్యర్థికి కోలుకునే అవకాశమే ఇ్వలేదు.
కాగా గత కొద్దికాలంగా నిఖత్ నిలకడగా రాణిస్తోంది. జూనియర్ లెవల్ లో వరల్డ్ ఛాంపియన్‌షిప్ గెలిచిన తర్వాత సీనియర్ లెవల్ లోకి ఎంట్రీ ఇచ్చిన నిఖత్.. 2019, 2022లలో జరిగిన స్ట్రాంజా మెమోరియల్ లో పసిడి పతకాలు గెలుచుకుంది. ఇక గతేడాది ఇస్తాంబుల్ తో పాటు కామన్వెల్త్ క్రీడల్లోనూ స్వర్ణాలు సాధించింది. ఈ ఏడాది ఐబీఏ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లోనూ నిఖత్ దే స్వర్ణం. తాజాగా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ విజేతగా నిలిచిన నిఖత్.. వచ్చే ఏడాది పారిస్ వేదికగా జరిగే ఒలింపిక్స్ లో కూడా స్వర్ణం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.