వరల్డ్ కప్ ఫైనల్‌లో మహిళా ఫుట్‌బాల్ ప్లేయర్‌కి లిప్‌లాక్.. స్పానిష్ ఫుట్‌బాల్ ఫెడరేషన్‌లో దుమారం..
ఆగస్టు 20న జరిగిన ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై స్పానిష్ ఘన విజయం.. స్పానిష్ ఉమెన్స్ టీమ్ స్టార్ ప్లేయర్ జెన్నీ హెర్మోసోకి లిప్ లాక్ ఇచ్చిన ఫుట్‌బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ లూయిస్ రూబియల్స్...
ఇద్దరూ ఇష్టపడి, పెట్టుకునే ముద్దు మురిపెంగా ఉంటుంది. ఒకరి ఇష్టంతో ప్రమేయం లేకుండా చొరవ తీసుకుని పెట్టే ముద్దు, ఇబ్బందులకు గురి చేస్తుంది. స్పానిష్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ లూయిస్ రూబియల్స్, ఓ మహిళా ఫుట్‌బాల్ ప్లేయర్‌కి ఇప్పుడు లిప్ లాక్... స్పానిష్ ఫుట్‌బాల్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది..
ఆగస్టు 20న జరిగిన ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై 1-0 తేడాతో విజయం అందుకుంది స్పానిష్ మహిళా ఫుట్‌బాల్ టీమ్. మ్యాచ్ అనంతరం జరిగిన అవార్డుల బహుకరణ కార్యక్రమంలో స్పానిష్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ లూయిస్ రూబియల్స్... స్పానిష్ ఉమెన్స్ టీమ్ స్టార్ ప్లేయర్ జెన్నీ హెర్మోసోని దగ్గరకి తీసుకుని,ఆమె పెదవులపై ముద్దు పెట్టాడు..
లూయిస్ రూబియల్స్ చేసిన ఈ పనిని, స్పానిష్ మంత్రి తప్పుబట్టాడు. ఆమె అంగీకారం లేకుండా, ఇష్టంతో పని లేకుండా ఇలాంటి పనులు చేయడం కరెక్ట్ కాదని కామెంట్ చేశారు. లూయిస్ రూబియల్స్, వెంటనే స్పానిష్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ మొదలైంది..
అయితే లూయిస్ రూబియల్స్ మాత్రం తన పదవికి రాజీనామా ఇవ్వడానికి అంగీకరించలేదు. జెన్నీ హెర్మోసోకి పెట్టిన ముద్దులో ఎలాంటి తప్పుడు ఉద్దేశం లేదని, ఆమె ఆటకు ముగ్దుడైపోయి అలా చేశానని వ్యాఖ్యానించాడు. ఈ విషయంలో ఫెమినిజాన్ని తీసుకురావడం కరెక్ట్ కాదని వాదించాడు లూయిస్ రూబియల్స్...
అయితే స్పానిష్ మహిళా ఫుట్‌బాల్ టీమ్ మాత్రం లూయిస్ రూబియల్స్, తన పదవికి రాజీనామా ఇచ్చేందుకు తాము ఏ మ్యాచ్ ఆడబోమంటూ ప్రకటించింది. ఈ విషయంపై స్పానిష్ ఫుట్‌బాల్ టీమ్ ప్లేయర్ జెన్నీ హెర్మోసో స్పందన ఎలా ఉంటుందా? అని అందరూ ఎదురుచూశారు.
ఈ సంఘటన జరిగిన తర్వాత 4 రోజులకు దీనిపై మాట్లాడింది జెన్సీ హెర్మోసో. ‘నిజానికి నాకు అలా జరుగుతుందని తెలీదు, అంత మంది చూస్తుండగా నా ఇష్టంతో అలా చేస్తాడని కూడా అనుకోలేదు. నా అంగీకారం లేకుండా నన్ను తాకడాన్ని కూడా నేను సహించను..’ అంటూ వ్యాఖ్యానించాడు హెర్మోసో..
ఈ కామెంట్లతో ఛైర్మెన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జెన్సీ హెర్మోసోపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు స్పానిష్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ సిద్ధమైంది. ఇదంతా జరుగుతుండగానే ఆగస్టు 26న లూయిస్ రూబియల్స్‌ని, అన్ని రకాల ఫుట్‌బాల్ సంబంధిత కార్యక్రమాల నుంచి సస్పెండ్ చేస్తూ ఫిఫా నిర్ణయం తీసుకుంది.
స్పానిష్ ఫుట్‌బాల్ ఫెడరేషన్‌లో ఉన్న హెడ్ కోచ్‌తో సహా 11 మంది కోచింగ్ స్టాఫ్ సిబ్బంది.. లూయిస్ రూబియల్స్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తమ పదవులకు రాజీనామా చేశారు. స్పానిష్ ఫుట్‌బాల్ ఫెడరేషన్‌లో మొదలైన ఈ వివాదంలో యూరోపియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ తలదూర్చడం ఈ రచ్చ మరింత పెరిగింది..
లూయిస్ రూబియల్స్ తల్లి, తన కొడుకుకి మద్ధతుగా తనను ఓ చర్ఛిలో నిర్భదించుకుని, నిరాహార దీక్ష చేయడం మొదలెట్టింది. స్పానిష్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ పరువు దిగజారుతుండడంతో లూయిస్ రూబియల్స్‌ని ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పుకోవాల్సిగా ఫెడరేషన్ డిమాండ్ చేసింది.
అయితే రాజీనామా చేయడానికి అప్పటికీ అంగీకరించని లూయిస్ రూబియల్స్, జెన్సీ హెర్మోసోతో పాటు మిగిలి ప్లేయర్లు తాను ఇచ్చిన కిస్ గురించి చర్చించుకుంటున్న వీడియోను ఫిఫాకి పంపాడు. ఫిఫా ప్రెసిడెంట్ జియానీ ఇఫాంటినో, ఈ ముద్దు వ్యవహారంపై స్పందించాడు.
‘ఫైనల్ తర్వాత ఫిఫా వరల్డ్ కప్ సంబరాలు ఘనంగా జరగాల్సింది. అయితే ఒక ముద్దు దాన్ని మొత్తాన్ని చెడకొట్టేసింది. ఇకపై ఇలాంటి జరగకుండా చూసుకుంటాం. దీనికి కారణమైన వారిపై కచ్ఛితంగా క్రమశిక్షణా రాహిత్య చర్యలు తీసుకుంటాం..’ అంటూ కామెంట్ చేశాడు లూయిస్ రూబియల్స్ జియానీ ఇఫాంటినో...