మెస్సీ వాడి, పాడేసిన టిష్యూ అమ్మాకానికి పెట్టేశాడు... ధర ఎంతో తెలిస్తే...

బార్సిలోనా క్లబ్ తరుపున ఇచ్చిన ఫేర్‌వెల్ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయిన మెస్సీ... లియోనెల్ మెస్సీ వాడేసిన టిష్యూకి మిలియన్ డాలర్ రేటును ఫిక్స్ చేసిన అభిమాని... 

Lionel Messi Used Tissue Paper during Barcelona farewell meeting

అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ, కొన్నాళ్ల క్రిందట బార్సిలోనా క్లబ్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. కాంట్రాక్ట్ విషయంలో జరిగిన కొన్ని సమస్యల కారణంగా బార్సిలోనా నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు మెస్సీ. బార్సిలోనా క్లబ్ తరుపున ఇచ్చిన ఫేర్‌వెల్ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయిన మెస్సీ, కన్నీళ్లు పెట్టుకున్నాడు...

ఈ సమయంలో మెస్సీ వాడిన టిష్యూ... ఇప్పుడు ఆన్‌లైన్‌లో అమ్మకానికి వచ్చింది. మెస్సీకి ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని, మెస్సీ పడేసిన ఆ టిష్యూని సేకరించిన ఓ తెలివైన ఫుట్‌బాల్ అభిమాని... దాన్ని ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టేశాడు. ఇంటర్నేషనల్ ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫాం ఎమ్‌ఈకెడో (Meikeduo)లో మెస్సీ వాడేసిన టిష్యూ అమ్మకానికి వచ్చింది.

వాడేసిన టిష్యూ అంటే ఎందుకు పనికి రాదు. అయితే ఫుట్‌బాల్ దిగ్గజం, కన్నీళ్లను తాకిన జెర్సీ కావడంతో దీనికి అతను ఫిక్స్ చేసిన ధర తెలిస్తే... మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే... మెస్సీ వాడేసిన టిష్యూకి మిలియన్ డాలర్ రేటును ఫిక్స్ చేశాడు సదరు అభిమాని. అంటే అక్షరాల 74 కోట్ల 35 లక్షల రూపాయలకు పైగా...

దీనికి అతను చెప్పిన కారణం... ఈ టిష్యూలో మెస్సీ జన్యూ మూలాలు ఉన్నాయి, వీటితో క్లోనింగ్ చేసి మెస్సీలాంటి దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్‌ను తయారు చేయొచ్చట... 2004 నుంచి బార్సిలోనాకి ఆడుతున్న లియోనెల్ మెస్సీ, 2021లో ఆ క్లబ్‌కి వీడ్కోలు పలికి పీఎస్‌జీలో చేరాడు. పారిస్ సెయింట్ జర్మన్ ఫుట్‌బాల్ క్లబ్ (పీఎస్‌జీ), మెస్సీకి కాంట్రాక్ట్ ద్వారా 35 మిలియన్ల యూరోలు (దాదాపు 354 కోట్ల రూపాయలకు పైగా) చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios