కేఎల్ రాహుల్ ఈ రోజు బ్యాట్‌తోనే కాదు.. ఫీల్డింగ్‌లోనూ సత్తా చాటాడు. బ్యాట్‌తో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 50 పరుగులు సాధించిన కేఎల్ రాహుల్ బంగ్లాదేశ్ ఓపెనర్, కీలక బ్యాట్‌మెన్ లిటన్ దాస్‌ను అద్భుతమైన త్రోతో రనౌట్ చేశాడు. 

న్యూఢిల్లీ: ఈ రోజు ఆస్ట్రేలియాలో జరిగిన భారత్ వర్సెస్ బంగ్లాదేశ్‌లో కేఎల్ రాహుల్ బ్యాట్‌తో సత్తా చాటడమే కాదు.. అద్భుతమైన త్రోతో ఫీల్డింగ్‌లోనూ జబర్దస్త్ అనిపించుకున్నాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ ముందు భారత్ 185 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. ఈ లక్ష్యంతో క్రీజులోకి దిగిన బంగ్లాదేశ్ ఓపెనర్లు మొదటి నుంచే దూకుడుగా ఆడటం ప్రారంభించారు. ఏడో ఓవర్ వరకు ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 66 పరుగుల బంగ్లాదేశ్ సాధించింది. కానీ, మ్యాచ్‌లో అప్పుడే వరుణుడు ఒక మలుపు తిప్పాడు. దీంతో షార్ట్ బ్రేక్ తర్వాత బ్యాట్‌మెన్స్ మళ్లీ క్రీజులోకి వచ్చారు. బంగ్లాదేశ్‌కు ఉత్తమ బ్యాట్‌మెన్‌లలో ఒకరైన లిటన్ దాస్ క్రీజులో నిలదొక్కుకుంటున్న సమయంలో కేఎల్ రాహుల్ ఆయనను ఊహించని రీతిలో పెవిలియన్‌కు పంపాడు.

వర్షం కొట్టడం మూలంగా ఇచ్చిన బ్రేక్ తర్వాత మళ్లీ క్రీజులోకి వచ్చిన బంగ్లాదేశ్ బ్యాట్‌మెన్స్‌కు కలిసి రాలేదు. మ్యాచ్ మళ్లీ మొదలయ్యాక రెండో బంతికే బంగ్లాదేశ్ వికెట్ కోల్పోయింది. స్ట్రైక్‌లో ఉన్న నజ్ముల్ హొస్సెన్ శాంతో క్రీజులో ఉన్నాడు. రవిచంద్రన్ అశ్విన్ విసిరిన బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా పంపాడు. ఆ బాల్‌ను కేఎల్ రాహుల్ పట్టుకున్నాడు. అక్కడి నుంచి గురించి విసిరిన బంతి నేరుగా వికెట్‌లను తాకింది. లిటన్ దాస్ మరొక అడుగులో క్రీజు చేరుకునేవాడే. కానీ, అంతలోనే మెరుపులా వచ్చిన బంతి నేరుగా వికెట్‌లను తాకింది. కేఎల్ రాహుల్ అద్భుతమైన త్రో.. కీలక వికెట్, బంగ్లాదేశ్ తొలి వికెట్ తీసింది.

Also Read: మ్యాచ్ జరుగుతుండగా విరాట్ కోహ్లీని హగ్ చేసుకున్న బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబ్ అల్ హసన్.. వీడియో వైరల్

తాను ఔట్ అయ్యానన్న విషయాన్ని వెంటనే లిటన్ దాస్ జీర్ణించుకోలేకపోయాడు. మరో బ్యాట్‌మెన్‌ను ఉరిమి చూశాడు. అంతే అసహనంగా బ్యాట్ చేతపట్టుకుని పెవిలియన్‌కు బయల్దేరాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

View post on Instagram

ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 32 బంతుల్లో మూడు బౌండరీలు, నాలుగు సిక్సర్లతో రెచ్చిపోయాడు. 50 పరుగులు సాధించి అవుటయ్యాడు.