భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్‌లో క్రికెట్ అభిమానులకు వేడుక చేసుకునే ఒక ద‌‌ృశ్యం కనిపించింది. నోబాల్ గురించిన వాదనల సమయంలో బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబ్ అల్ హసన్.. విరాట్ కోహ్లీని హగ్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. 

న్యూఢిల్లీ: ఈ రోజు ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌ ఓవల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పై భారత్ విజయం సాధించింది. ఇందులో విరాట్ కోహ్లీ మరోసారి బ్యాట్‌తో మెరుపులు కురిపించాడు. 44 బంతుల్లోనే 66 పరుగులు సాధించాడు. 145.45 స్ట్రైక్ రేట్ చెలరేగిన ఈ మాజీ కెప్టెన్ 8 బౌండరీలు, ఒక సిక్స్‌తో టీమిండియా స్కోర్ బోర్డుకు కీలకమైన పరుగులను జోడించాడు. బంగ్లాదేశ్ ముందు 185 పరుగుల టార్గెట్‌ను నిలపడానికి విరాట్ కోహ్లీ పరుగులు దోహదపడ్డాయి. వర్షం మూలంగా బంగ్లాదేశ్ ఇన్నింగ్‌ను 20 ఓవర్ల నుంచి 16 ఓవర్లకే కుదించారు. తద్వార 151 పరుగుల లక్ష్యాన్ని నిర్ణయించారు. ఈ మ్యాచ్‌లో భారత్ ఐదు రన్నులతో గెలిచింది.

ఈ మ్యాచ్‌లో కొన్ని క్రికెట్ అభిమానులకు వావ్ అనిపించే మూమెంట్లు లభించాయి. అందులో ముఖ్యంగా విరాట్ కోహ్లీని బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబ్ అల్ హసన్ హగ్ చేసుకునే సీన్ చాలా మంది దృష్టిలో నిలిచిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలోనూ హల్ చల్ చేస్తున్నది.

విరాట్ కోహ్లీ స్ట్రైకింగ్‌లో ఉన్నప్పుడు 16వ ఓవర్‌లో హసన్ మహ్ముద్ వేసిన బంతి విరాట్ కోహ్లీ తలకు పైగా ఎత్తుతో వచ్చింది. దాన్ని బాదిన విరాట్ కోహ్లీ వెంటనే అంపైర్‌ను చూస్తూ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇది నోబాల్ కదా అన్నట్టుగా సంజ్ఞ చేశాడు. విరాట్ కోహ్లీని చూసిన తర్వాత అంపైర్ ఆ బంతిని నోబాల్‌గా డిక్లేర్ చేశారు.

Also Read: అదే ప్రత్యర్థి.. అప్పుడు ధోని.. ఇప్పుడు కెఎల్ రాహుల్.. సేమ్ సీన్ రిపీట్..

ఆ బాల్‌ను నోబాల్‌గా డిక్లేర్ చేయగానే.. అక్కడే ఉన్న బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబ్ అల్ హసన్ అంపైర్‌తో వాదించడానికి ప్రయత్నించాడు. షకిబ్ అల్ హసన్‌ను అంపైర్ ఆపే ప్రయత్నం చేశాడు. అక్కడే విరాట్ కోహ్లీ కూడా అంపైర్‌తో మాట్లాడుతున్నాడు. అంపైర్‌తో వాదించుకుంటూనే షకిబ్ అల్ హసన్ కోహ్లీ వైపు వచ్చాడు. విరాట్ కోహ్లీని హగ్ చేసుకుని అతనికి కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. అంతలోనే అన్ని సర్దుకున్నట్టుగా షకిబ్ అల్ హసన్.. విరాట్ కోహ్లీని హగ్ చేసుకుని వెనక్కి వెళ్లిపోయాడు. 

Scroll to load tweet…

కానీ, షకిల్ అల్ హసన్, విరాట్ కోహ్లీ హగ్ ఇప్పుడు ట్విట్టర్‌లో సంచలనమైంది. ఈ వీడియో వైరల్ అవుతున్నది.