యువరాణిలా చూస్తా: నిధి అగర్వాల్ తో డేటింగ్ పై కెఎల్ రాహుల్

KL Rahul reacts on dating Nidhi Agerwal dating
Highlights

తన జీవిత భాగస్వామిని యువరాణిలా చూస్తానని టీమిండియా క్రికెటర్ కెఎల్ రాహుల్ అన్నాడు.

బెంగళూరు: తన జీవిత భాగస్వామిని యువరాణిలా చూస్తానని టీమిండియా క్రికెటర్ కెఎల్ రాహుల్ అన్నాడు. బాలీవుడ్ నటి నిధి అగర్వాల్ తో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారమవుతున్న పుకార్లపై ఆయన స్పందించాడు. కేఎల్‌ రాహుల్‌ ముంబైలోని బాంద్రాలో బాలీవుడ్‌ హీరోయిన్‌ నిధి అగర్వాల్‌తో కనిపించిన విషయం విదితమే. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి.

దానిపై హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ ఇప్పటికే స్పందించింది. తామిద్దరం మంచి స్నేహితులమని రాహుల్ చెప్పాడు. చాలా కాలం నుంచి తమకు పరిచయం ఉందని చెప్పాడు. జాతీయ మీడియాతో ఆయన నిధి అగర్వాల్ తో డిన్నర్ కు వెళ్లిన విషయంపై మాట్లాడాడు.

తామిద్దరం ఒకే నగరం నుంచి వచ్చామని, ఆమె తన రంగంలో ముందుకు వెళ్లడం చాలా సంతోషమని అన్నాడు. తాను క్రికెటర్‌ కాకముందు నుంచి, ఆమె హీరోయిన్‌ కాక ముందు నుంచే ఇద్దరికి పరిచయం ఉందని అన్నాడు.

తామిద్దరమే కాదు బెంగళూరుకి చెందిన స్నేహితులతో కలిసి డిన్నర్‌కు వెళ్లామని, తాను మీకు ఏమి జరగలేదని గ్యారంటీ ఇస్తున్నానని అన్నాడు. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే అందరికీ తెలిసేలా చేస్తానని కూడా అన్నాడు. తన జీవిత భాగస్వామిని యువరాణిలా చూసుకుంటానని, అంతేగానీ ఏ విషయాన్ని కూడా దాచిపెట్టనని అన్నాడు. 

loader