Asianet News TeluguAsianet News Telugu

కేరళ సాంప్రదాయ పద్దతిలో విండీస్ ఆటగాళ్లకు స్వాగతం (వీడియో)

భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే సీరిస్ లో భాగంగా చివరి మ్యాచ్ గురువారం కేరళలో జరగనుంది. త్రివేండ్రంలోని గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియం ఈ నిర్ణయాత్మక మ్యచ్ కు వేధిక కానుంది. ఇప్పటికే రెండు వన్డేల్లో భారత్, ఒక వన్డేలో విండీస్ విజయం సాధించగా విండీస్ వన్డే టైగా ముగిసింది. దీంతో త్రివేండ్రంలో జరిగే మ్యాచ్ సీరిస్  విజేతలను నిర్ణయించనుండటంతో ఈ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
 
kerala peoples welcome to windies team in local style
Author
Trivandrum, First Published Oct 31, 2018, 6:47 PM IST

భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే సీరిస్ లో భాగంగా చివరి మ్యాచ్ గురువారం కేరళలో జరగనుంది. త్రివేండ్రంలోని గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియం ఈ నిర్ణయాత్మక మ్యచ్ కు వేధిక కానుంది. ఇప్పటికే రెండు వన్డేల్లో భారత్, ఒక వన్డేలో విండీస్ విజయం సాధించగా విండీస్ వన్డే టైగా ముగిసింది. దీంతో త్రివేండ్రంలో జరిగే మ్యాచ్ సీరిస్  విజేతలను నిర్ణయించనుండటంతో ఈ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు కేరళకు చేరుకున్నాయి. అయితే విండీస్ జట్టుకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. అలాగే విండీస్ ఆటగాళ్లకు హోటల్ సిబ్బంది కూడా వినూత్నంగా స్వాగతం పలికారు. కేరళ సాంప్రదాయ పద్దతుల్లో మేళ తాళాలతో వారికి సాదరంగా  ఆహ్వానించారు. ఆ తర్వాత వారికి  బొట్టు పెట్టి ఓ కొబ్బరి బోండాను అందించారు. ఈ ఆహ్వానానికి విండీస్ ఆటగాళ్లు కూడా ఫిదా అయ్యారు.

ఈ విషయాన్ని వెస్టిండీస్‌ క్రికెటర్లు తమ ట్విట్టర్ వేధికలో వెలడించారు. ఈ ట్వీట్ లో కేరళను చూస్తుంటే మా దేశం గుర్తుకు వస్తుందంటూ కామెంట్ చేస్తూ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోను కింద చూడండి. 

Follow Us:
Download App:
  • android
  • ios