Asianet News TeluguAsianet News Telugu

యూసుఫ్ లక్కీ, ఆ క్యాచ్ పట్టి ఉంటే...: ఢిల్లీపై సన్ రైజర్స్ విజయం

శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ డేర్ డెవిల్స్ పై ఘన విజయం సాధించింది.

Kane Williamson, Yusuf Patthan lead SRH to win vs Delhi

హైదరాబాద్: శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ డేర్ డెవిల్స్ పై ఘన విజయం సాధించింది. కాన్ విలియమ్సన్, యూసుఫ్ పఠాన్ హైదరాబాదుకు 7 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించి పెట్టారు. 

సన్ రైజర్స్ 19.5 ఓవర్లలో 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. తర్వాతి స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. పృథ్వీ షా (65), శ్రేయస్ అయ్యర్ (44) చెలరేగి ఆడడంతో ఒక స్థితిలో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 200 పరుగులకు పైగా సాధిస్తుందని భావించారు. కానీ హైదరాబాద్ బౌలర్లు కట్టడి చేసి 163 పరుగులకే పరిమితం చేశారు. 

ఓపెనర్ అలెక్స్ హైల్స్ చెలరేగి ఆడి హైదరాబాదుకు మెరుపు ఆరంభాన్నిచ్చాడు. 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్యాచ్ జారవిడవడంతో హేల్స్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అతను 31 బంతుల్లో మూడు సిక్స్ లు, మూడు ఫోర్లతో 45 పరుగులు చేశాడు. ఆవేశ్ ఖాన్ వేసిన ఆరో ఓవరులో మూడు సిక్సులు బాదాడు. క్యాచ్ జార విడిచి ఉండకపోతే ఫలితం మరో రకంగా ఉండేది కావచ్చు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 30 బంతుల్లో 33 పరుగులు చేశాడు. 

అమిత్ మిశ్రా పది పరుగుల తేడాతో హేల్స్, ధావన్ లను ఇద్దరిని పెవిలియన్ దారి పట్టించాడు. వారిద్దరు తొలి వికెట్ కు 76 పరుగులు జోడించారు. ఆ తర్వాత పాండే భారీ షాట్ కు ప్రయత్నించి అవుటయ్యాడు. అప్పటి సన్ రైజర్స్ మూడు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. 

అప్పటికి సైన్ రైజర్స్ 17 బంతుల్లో విజయానికి 32 పరుగులు చేయాల్సి ఉండింది. ఆ స్థితిలో మైదానంలోకి దిగిన యూసుఫ్ పఠాన్ రెండు సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. చివరి ఓవరులో 14 పరుగులు అవసరం కాగా క్రిస్టియన్ వేసిన తొలి బంతికి పఠాన్ 2 పరుగులు తీశాడు. తర్వాత బంతిని సిక్సర్ గా మలిచాడు. మూడో బంతికి బౌండరీ వచ్చింది. దీంతో సన్ రైజర్స్ విజయం ఖాయమైంది. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీకి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. రెండు పరుగులు మాత్రమే చేసి మాక్స్ వెల్ రన్నవుటయ్యాడు. పృథ్వీ, శ్రేయస్ అయ్యర్ జోరుగా ఆడారు. అయితే ఢిల్లీ 5 వికెట్లు నష్టపోయి 163 పరుగులు చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios