ఆస్ట్రేలియాతో పాటు యావత్ ప్రపంచ క్రికెట్‌ను ఒక కుదుపు కుదిపిన బాల్ ట్యాంపరింగ్ వివాదం మరోసారి తెరమీదకు రావడంతో ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ ఫైరయ్యాడు. ట్యాంపరింగ్‌కు పాల్పడి నిషేధం ఎదుర్కొంటున్న స్టీవ్ స్మిత్, బాన్‌క్రాఫ్ట్‌లు మీడియా ముందుకు వచ్చి తమకు ఏ తప్పు తెలియదని, మొత్తం నెపాన్ని డేవిడ్ వార్నర్ మీదకు నెట్టేసే ప్రయత్నం చేశారు.

దీనిపై స్పందించిన జస్టిన్ లాంగర్ బాల్ ట్యాంపరింగ్ అనేది ముగిసిపోయిన అధ్యాయమని, దాని గురించి పదే పదే చర్చించుకోవడం అనవసరమైన సబ్జెక్ట్ అన్నాడు. ఒక చేదు జ్ఞాపకాన్ని వదిలేయకుండా ఒక సీరియల్ డ్రామాలా సాగదీస్తున్నారంటూ మండిపడ్డాడు.  

వారిద్దరి వ్యాఖ్యలు చూస్తే ఆ డ్రామాకు తానొక డైరెక్టర్‌నా అనిపిస్తోందన్నాడు. ఇంటర్వ్యూ ఇచ్చి స్మిత్, బాన్‌క్రాఫ్ట్‌లు మరో ఇబ్బంది తెచ్చిపెట్టారంటూ ఫైరయ్యాడు. స్మిత్, వార్నర్‌లు జట్టులోకి పునరాగమనం చేసే వరకు టీమ్ పైన్, ఫించ్‌లు ఆసీస్ వేర్వేరు జట్లకు కెప్టెన్లగా కొనసాగుతారని లాంగర్ స్పష్టం చేశాడు.