ధోనీపై ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ సంచలన వ్యాఖ్యలు

First Published 25, Jun 2018, 6:13 PM IST
Jos Buttler better than MS Dhoni, says visiting captain Tim Paine
Highlights

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైనె సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

మాంచెస్టర్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైనె సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎంఎస్ ధోనీ కన్నా ఇంగ్లండ్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ జాస్ బట్లర్ అత్యుత్తమ క్రికెటర్ అని అతను అన్నాడు. 

ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టుకి అక్కడ జరిగిన ఐదు వన్టేల సిరీస్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. అక్కడ ఆడిన ఐదు వన్డేల్లో కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా ఆస్ట్రేలియా విజయం సాధించలేకపోయింది.  
అయితే ఆదివారంనాటి మ్యాచ్ తర్వాత నిర్వహించిన ప్రెస్ మీట్‌లో టిమ్ ధోనీపై వ్యాఖ్యలు చేశాడు. వన్డే క్రికెట్‌లో వికెట్‌ కీపర్-బ్యాట్స్‌మన్లలో బట్లర్ ముందు వరుసలో ఉంటాడని, ధోనీ మంచి కీపర్-బ్యాట్స్‌మన్ అయినప్పటికీ ప్రస్తుతం బట్లర్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడని అన్నాడదు.

పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చకొగలిగే సత్తా ఉన్న ఆటగాడు బట్లర్ అని, మరీ ముఖ్యంగా వన్డే క్రికెట్‌లో బట్లర్ ఎంతో ప్రమాదకరమైన ఆటగాడని పైనె అన్నాడు. 

ఆసీస్‌తో జరిగిన చివరి వన్డేలో బట్లర్‌(110 నాటౌట్‌) అజేయంగా శతకం సాధించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు. సిరీస్ లో బట్లర్ మొత్తం 275 పరుగులు చేశాడు. మూడు మ్యాచుల్లో 91, 54, 110 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

loader