హెచ్‌సీఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు విజయం.. ఒక్క ఓటుతో గెలుపు , రీకౌంటింగ్ కోరుతోన్న అమర్‌నాథ్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు విజయం సాధించారు. ఒకే ఒక్క ఓటు తేడాతో ఆయన ఎన్నికలో గెలిచారు. అయితే ఆయన ప్రత్యర్ధి అమర్‌నాథ్ మాత్రం ఓట్లను రీకౌంటింగ్ చేయాల్సిందిగా అడుగుతున్నారు.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు విజయం సాధించారు. ఒకే ఒక్క ఓటు తేడాతో ఆయన ఎన్నికలో గెలిచారు. అయితే ఆయన ప్రత్యర్ధి అమర్‌నాథ్ మాత్రం ఓట్లను రీకౌంటింగ్ చేయాల్సిందిగా అడిగారు. అమర్‌నాథ్‌కు 62 ఓట్లు రాగా.. జగన్‌మోహన్ రావుకు 63 శాతం ఓట్లు పడ్డాయి. అలాగే హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడిగా దల్జిత్ సింగ్ , సెక్రటరీగా దేవరాజు, జాయింట్ సెక్రటరీగా బసవరాజు, కోశాధికారిగా సీజే శ్రీనివాసరావు, కౌన్సిలర్‌గా సునీల్ అగర్వాల్ గెలుపొందారు.
కాగా.. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో హెచ్‌సీఏ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం ఆరు స్థానాలకు ఓటింగ్ నిర్వహించారు. 173 ఓట్లకు గాను 169 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా రిటైర్డ్ ఐఏఎస్ వీఎస్ సంపత్ వ్యవహరించారు.
బరిలో వున్న ప్యానెల్స్ ఇవే :
జగన్‌మోహన్ రావు ప్యానెల్ :
పి, శ్రీధర్, ఆదినారాయణ రావు, నోయల్ డేవిడ్, సీజే శ్రీనివాస్, అన్సర్ అహ్మద్ ఖాన్
క్రికెట్ ఫస్ట్ ప్యానెల్ :
అమర్‌నాథ్, దేవరాజ్, సంజీవరెడ్డి, చిట్టి శ్రీధర్ , సునీల్ కుమార్, శ్రీనివాసరావు
ఆనెస్ట్ హార్డ్ వర్కింగ్ హెచ్‌సీఏ :
పీఎల్ శ్రీనివాస్, బాబూరావు, భాస్కర్, రోహిత్ అగర్వాల్, జెరార్డ్ కార్, డీఏజే వాల్టర్
గుడ్ గవర్నెన్స్ :
అనిల్ కుమార్, ఆగమరావు, దల్జీత్ సింగ్, బసవరాజు, వినోద్ ఇంగ్లే, మహేంద్ర,